దేవరకొండ 'బేబీ'.. వచ్చేది ఎప్పుడంటే?

Update: 2023-06-13 16:57 GMT
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడి గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ  హీరో గా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయం లోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమా లో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్ర ను పోషించాడు.

ఎస్కే ఎన్ ఈ సినిమాను నిర్మించగా, సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా, ఈ మూవీ లో పాటలు విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయాయి. విడుదలకు ముందే పాటలు హిట్ అయిపోయాయి. ముఖ్యం,'ఆ రెండు ప్రేమ మేఘాలు', 'ప్రేమిస్తున్నా ... ప్రేమిస్తున్నా .. నీ ప్రేమ లో జీవిస్తున్నా' సాగే ఈ రెండు పాటలు బాగా నచ్చేశాయి. కాగా, ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  జులై రెండో వారం లో సినిమా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. కరెక్ట్ గా చెప్పాలి అంటే జులై 14న ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు.  కాగా, ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఈ మూవీ కి  సాయి రాజేష్ దర్శకత్వం వహంచగా, మాస్ మూవీ మేకర్ పతాకం పై ఎస్కేఎన్ నిర్మించారు.

ఈ సినిమా పూర్తిగా ప్రేమ కథ అనే విషయం తెలుస్తోంది. ముందు ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ఇది ఇద్దరి మధ్య సాగే ప్రేమ కథ అని అనుకున్నారు. కానీ, ప్రేమిస్తున్నా పాట విన్న తర్వాత ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం అర్థమౌతోంది. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మూవీ చూస్తే గానీ తెలీదు.

ఇదిలా ఉండగా, ఈ మూవీ కి  విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. కాగా, ఈ మూవీ లో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషించారు.

Similar News