అప్పట్లో బాహుబలి ప్రభాస్ గురించి ట్వీటేసిన ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీ సిఇఓ.. ఇప్పుడు మరో సినిమా గురించి ట్వీటేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా సిఇఓ ఆనంద్ మహీంద్రానే మన వార్తలోని వ్యక్తి. అసలు ఆయన సినిమాల గురించి ట్వీటేస్తున్నారంటేనే కార్పొరేట్ వరల్డ్ షాకైపోతోంది. ఇక ఇప్పుడు ఆయన మరో సినిమా గురించి చెప్పారంటే చూడండి మరి.
అప్పట్లో బాహుబలి సినిమా ఇండియన్ సినిమా విలువలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ట్వీటేసిన ఆనంద్.. ఇప్పుడు సోనమ్ కపూర్ హీరోయిన్ గా వస్తున్న ''నీర్జా'' అనే సినిమా గురించి మాట్లాడారు. నీర్జా అనే భారతీయ ఎయిర్ హోస్టెస్ తన ప్రాణాలను పణంగా పెట్టి హైజాక్ ఘటన నుంచి 359 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అమె జీవితం ఆధారంగా సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నీర్జా’ లాంటి సినిమాలు మరిన్ని రావాలని మహీంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర చెప్పారు.. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ వీక్షించిన ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ మధ్యన భారతీయ సినిమాలు కార్పొరేట్ దిగ్గజాలను కూడా టచ్ చేస్తున్నాయంటే.. నిజంగానే మన సినిమాల స్థాయి పెరిగినట్లే.