అప్పుడే విరిసిన మల్లెపువ్వులు .. అప్పుడే కురిసిన మంచు బిందువులు .. అప్పుడే తడిసిన తామర రేకులు చూస్తే 'ఆనంది' గుర్తొస్తుంది. చక్కని పలువరుసతో .. అల్లరి చేపల్లాంటి కళ్లతో .. వెండిపాత్రలో ఒలికిన వెన్నెల్లా కనిపిస్తుంది. ముద్ద మందారానికో .. ముద్ద కర్పూరానికో రూపం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంత అందంగా .. గంధపు గిన్నెలా ఆనంది కనిపించడానికి కారణం ఏమిటంటే .. ఆ అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయి కావడమే. అవును ఆనంది అచ్చ తెలుగు అమ్మాయే. వరంగల్ లో పుట్టిపెరిగిన ఈ అమ్మాయికి, తెలుగులో కంటే తమిళంలో మంచి గుర్తింపు రావడం విశేషం.
'ఈ రోజుల్లో' సినిమాతో తెలుగు తెరకి 'ఆనంది' పరిచయమైంది. చక్కని కనుముక్కుతీరున్న చక్కరకేళిలాంటి ఈ అమ్మాయిని చూసిన కుర్రకారుకు కునుకు పట్టలేదు. యూత్ లో ఈ అమ్మాయికి వచ్చిన క్రేజ్ కారణంగా ఆ వెంటనే 'బస్ స్టాప్' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా ఈ అమ్మాయిని యూత్ కి మరింత చేరువ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలతో ఆనంది కెరియర్ స్పీడ్ అందుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే మెరిసిన ఈ అమ్మాయి, తమిళ ఇండస్ట్రీకి తన మకామ్ మార్చింది.
తమిళంలో కొత్త కథానాయికలతో టీనేజ్ లవ్ స్టోరీస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న సమయంలో అక్కడ అడుగు పెట్టడం ఆనందికి బాగా కలిసొచ్చింది. తొలి వరుసలో చేసిన సినిమాలు ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అక్కడ కుర్రాళ్లు చాలామంది ఆమె ఆరాధకులుగా మారిపోయారు. దాంతో ఆ క్రేజ్ ను కాపాడుకుంటూ ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అథర్వ .. జీవీ ప్రకాశ్ కుమార్ .. దినేశ్ .. కథిర్ జోడీగా ఆనంది చేసిన సినిమాలు ఆమె జోరును పెంచాయి. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఈ సినిమాలు తన స్థాయిని మరింత పెంచుతాయని ఆమె భావిస్తోంది.
ఏడేళ్ల తరువాత ఆనంది పేరు మళ్లీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'జాంబి రెడ్డి' సినిమాలో ఆమె నటించింది. 'అ' .. 'కల్కి' సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ, తన స్టైల్ ను మార్చుకుని చేసిన సినిమా ఇది. కర్నూల్ నేపథ్యంలో సాగే ఈ కథ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తను పోషించిన పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆనంది భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో .. రీ ఎంట్రీ ఆమెకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.