2.9 కోట్ల సినిమాకు 3 కోట్ల శాటిలైట్

Update: 2017-08-27 04:42 GMT

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను నటించిన లేటెస్ట్ మూవీ ఆనందో బ్రహ్మ. ఈ మధ్య బాలీవుడ్ అవకాశాలు అందుతుండడంతో.. తెలుగోళ్లను బాగా ఆడిపోసుకున్నా.. ఈమె నటించిన ఆనందో బ్రహ్మ సినిమాను మాత్రం తెలుగు జనాలు బాగానే ఆదరిస్తున్నారు. అయితే.. ఈ సక్సెస్ లో ఆమెకు పెద్దగా క్రెడిట్ దక్కకపోయినా.. హిట్ మాత్రం తాప్సీ ఖాతాలో వేయాల్సిందే. ఇప్పటికే వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఆనందో బ్రహ్మకు.. ఇప్పుడు జాక్ పాట్ తగిలినట్లు చెబుతున్నారు.

థియేటర్లలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్న ఆనందో బ్రహ్మ చిత్రానికి.. ఇప్పుడు శాటిలైట్ కూడా పూర్తయిందట. దేశవ్యాపత్తంగా గుర్తింపు ఉన్న ఓ ఛానల్.. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను రూ. 3 కోట్లతో కొనుగోలు చేసిందనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఎందుకంటే అసలు ఈ మూవీ మొత్తం బడ్జెట్ కూడా అంత లేదు మరి. కేవలం రూ. 2.9 కోట్ల బడ్జెట్ పూర్తి చేయగా.. ఇంతకు మించిన మొత్తాన్ని శాటిలైట్ ద్వారా రాబట్టగలగడం విశేషం. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ ను జనాలు ఫుల్లుగా ఎంజాయ్ చేయడం.. శ్రీనివాసరెడ్డి.. వెన్నెల కిషోర్.. షకలక శంకర్.. తాగుబోతు రమేష్ లపై నడిచే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవడం జరిగాయి.

అలాగే సినిమా కాన్సెప్ట్ లో భాగంగా వచ్చే కామెడీ మినహాయిస్తే.. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ లేకుండా.. మూవీని గ్రిప్పింగ్ గా తీయడం ఈ చిత్రానికి కలిసొచ్చిందని చెప్పాలి. మొత్తం మీద థియేట్రికల్ కలెక్షన్స్ తో ఇప్పటికే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్న ఆనందో బ్రహ్మ.. ఇప్పుడు శాటిలైట్ రూపంలో కూడా వసూళ్ల పండగ చేసేసుకుంటోంది.
Tags:    

Similar News