ఫోటో స్టోరీ: రంగమ్మత్త జబర్దస్త్ పోజు

Update: 2019-08-14 13:35 GMT
బుల్లితెరపై యాంకరింగ్ తో భారీ పాపులారిటీ సాధించిన హాట్ లేడీ అనసూయ భరద్వాజ్.  ఈమధ్య అనసూయ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.   'క్షణం'.. 'రంగస్థలం' లాంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన అనసూయ రీసెంట్ గా 'కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇదిలా ఉంటే సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాజాగా అనసూయ ఖతార్ లోని దోహాకు చేరుకుంది.

దోహా విమానాశ్రయం చేరుకున్న సందర్భంగా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించిన ఫోటోలను అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.  రెడ్ కలర్ టాప్... డెనిమ్ మైక్రో షార్ట్ ధరించిన అనసూయ పైనేమో బటన్లు వేసుకోకుండా బొత్తాలు లేని రత్తాలు లాగా యమా స్టైలిష్ గా కనిపించింది. కళ్ళజోడు.. భుజానికి ఓ క్రీమ్  కలర్ హ్యాండ్ బ్యాగ్ తో స్టైల్ ను రంగరించింది. ఈమధ్య 'కథనం' ప్రమోషన్స్ సందర్భంగా చేసిన గ్లామర్ ప్రదర్శనను కొనసాగిస్తూ దోహాను కూడా వేడెక్కించింది రంగమ్మత్త.

ఈ ఫోటోలకు ట్విట్టర్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "డైనమిక్ అండ్ స్టైలిష్".. "వావ్.. సో లవ్లీ".. "పిచ్చి లేచిపోతోంది" అంటూ ఎవరికీ తోచిన స్టైల్ లో వారు పొగడ్తలు కురిపించారు. అనసూయ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
 

Tags:    

Similar News