మన దారిన మనం పోదామనుకునే సెలబ్రిటీలు ఎక్కువ. కానీ.. కొంతమంది అందుకు భిన్నం. తమతో పాటు.. తమ చుట్టూ ఉన్న వారి మీదా ఒక కన్నేసి ఉంటారు. ఎదుటోడు తప్పు చేస్తే.. ఆ విషయాన్ని ప్రస్తావించి.. జాగ్రత్తలు చెప్పే ధోరణి కొందరు సెలబ్రిటీల్లో కనిపిస్తుంది. అలాంటి తీరు యాంకర్ కమ్ నటి అనసూయకు కాస్త ఎక్కువే. గతంలో ఆమె చేసిన ట్వీట్లు కొన్నింటిపై ఆసక్తికర చర్చ సాగింది.
తాజాగా అలాంటి పరిస్థితినే ఆమె ఎదుర్కొంటున్నారు. ఏదో చేయబోయి.. మరేదో అయినట్లుగా అనసూయ పరిస్థితి తయారైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి హియర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ లో వీడియో చూస్తున్న వైనాన్ని ఆమె రికార్డు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో ప్రయాణించే సమయంలో ఆమె తన పక్కనున్న కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తీరును తప్పు పడుతూ ట్రాఫిక్ పోలీసులకు ట్వీట్ పోస్ట్ చేశారు.
డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటివి నన్ను భయపెడుతుంటాయి. ఇంతకు ముందే కూడా వేరే వారి తప్పు కారణంగా ప్రమాదానికి గురయ్యారు. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్లను వదలొద్దు.. రోడ్ల మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేసే వారిని వదలొద్దు. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
గత ఏడాది ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె గాయాలపాలయ్యారు కూడా. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటాన్ని తప్పు పట్టారు.
అయితే.. అనసూయ ట్వీట్ నెటిజన్లకు నచ్చలేదు. చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. మంచికారణం మీద వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు. ఫర్లేదు.. నేను ఎలాంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. అనసూయ ట్వీట్ కు కొందరు సలహాలు ఇస్తూ.. దిగి సదరు వ్యక్తికి సలహా చెప్పొచ్చు కదా అన్న మాటకు స్పందించిన ఆమె.. అలా చేస్తే.. యూట్యూబుల్లో ఎలాంటి హెడ్డింగులు కనిపించేవో అందరికి తెలసంటూ వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అంటారని.. చేసే పని చేయకుండా ఉండటం ఎందుకు అనసూయ. మంచి చేయాలనుకున్నప్పుడు కొందరు తప్పు పట్టొచ్చు.. అలా అని మంచి చేయకుండా ఉండలేం కదా? ఎవరో ఏదో అంటారని వెనక్కి తగ్గటం ఏంది..?