జ్యోతిలక్ష్మి జయమాలిని రోజులు ఇప్పుడు లేవు! ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ నంబర్లలో నర్తిస్తూ అందాలు ఆరబోస్తున్నారు. కో అంటే కోటి పడుతున్నారు. ఐదు నిమిషాల ఐటమ్ నంబర్ కి 4 కోట్లు తీసుకున్న హీరోయిన్లు ఉన్నారు. ఇకపోతే డ్యాన్సర్లు యాంకర్లతో ఐటమ్ నంబర్లు చేయించే అలవాటు మన పరిశ్రమకు ఉంది.
ఇక ఐటమ్ నంబర్ లో నర్తించాలంటే కొన్ని ప్రమాణాలు కథానాయిక లేదా యాంకర్ లేదా డ్యాన్సర్ లో చూస్తారు. కానీ అవేవీ లేకుండానే కొందరికి అవకాశాలొస్తుంటాయి. పర్ఫెక్ట్ ఫిట్ గా స్లిమ్ అండ్ హాట్ లుక్ లో కనిపించే ఐటమ్ భామలకు ఉండే క్రేజ్ మరీ బొద్దుగా జయమాలిని కాలాన్ని తలపిస్తే ఇప్పుడు లేనే లేదు. కానీ అలాంటివేవీ పట్టింపు లేకుండానే `వాంటెడ్ పండుగాడ్` అనే మూవీ లో అనసూయతో ఐటమ్ నంబర్ చేయించడం చర్చగా మారింది.
`వాంటెడ్ పండుగాడ్` చిత్రంలో కేక అంటూ సాగే ఐటమ్ నంబర్ లో అనసూయ నర్తించింది. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. కానీ ఈ పాటలో అంత కేక పెట్టించే మ్యాటర్ ఏదీ లేదని తేలిపోయింది. ఈ పాటకు ట్యూన్ రొటీన్ గా ఉండడం ఒక మైనస్ అనుకుంటే.. అనసూయ గ్లామర్ డోస్ ఏమంత ఆకర్షించలేదు. పాట చిత్రీకరణ కొరియోగ్రఫీ కూడా చాలా సాధారణంగా అనిపించాయి.
నిజానికి మాస్ ని థియేటర్లకు రప్పించేది ఇలాంటి ఐటమ్ నంబర్ లే. కానీ ఆశించిన మార్క్ లో అనసూయ గ్లామర్ ఎలివేషన్ లేకపోవడం యువతరాన్ని నీరుగార్చింది. ట్రెడిషనల్ గా కనిపించాలనుకుంటే ఐటమ్ నంబర్ లో నర్తించాల్సిన అవసరం ఏం ఉంది? అని ఈ ప్రోమో చూశాక నెటిజనం ప్రశ్నిస్తున్నారు.
అనసూయ ఇప్పటికే ఐటమ్ నంబర్లలో కనిపిస్తోంది. గతంలో `చావుకబురు చల్లగా` సినిమాలో అనసూయ చేసిన ఐటెం సాంగ్ అంతంత మాత్రంగానే నిలిచింది. మూవీ క్రేజ్ పెంచడంలో అది కలిసి రాలేదు. కె రాఘవేంద్రరావు సమర్పణలో రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది.
అనసూయ ఐటమ్ పాటతో పాటు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అన్నట్టు యాంకర్ అనసూయ నర్తిస్తే స్పెషల్ నంబర్ అనాలి కానీ ఐటమ్ నంబర్ అనకూడదు. దీనిపై ఇంతకుముందు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతిని ఎవరూ మరువలేదు సుమీ.
Full View