ప్రమాదకరమైన రచన - ట్రైలర్ టాక్

Update: 2019-08-03 11:35 GMT
గత ఏడాది రంగస్థలంలో రంగమ్మత్తగా బోలెడు మెప్పులతో పాటు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న యాంకర్ అనసూయ కొత్త సినిమా కథనం ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో తనదే లీడ్ రోల్. కథ విషయానికి వస్తే తెలుగు సినిమా దర్శకురాలిగా ఎదగాలని కలలు కనే అనసూయకు కథలు రాసుకోవడం అలవాటు. ఎందరో దర్శకులను నిర్మాతలను కలిసి వాటిని వినిపిస్తుంది. తనకో అసిస్టెంట్(ధన్ రాజ్)ఉంటాడు.

చాలా ప్రయత్నాల తర్వాత ఫైనల్ గా డైరెక్టర్ గా మారుతుంది. అనూహ్యంగా తాను ఏదైతే  కథ రాసుకుంటుందో  అచ్చం అదే తరహాలో నిజ జీవితంలో మర్డర్లు జరుగుతూ ఉంటాయి. వాటిని అనసూయ ముందుగానే పసిగడుతున్నా హంతకులు ఎవరో మాత్రం ఊహించలేక పోలీసుల సహాయం తీసుకుంటుంది. దీని వెనుక ఏవో అరాచక శక్తులు ఉన్నాయని అర్థమవుతుంది. తను రాసిన కథనమే తనకు ప్రాణాంతకంగా మారితే అనసూయ ఎలా బయటపడింది అనేదే కథనం

ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. ఆసాంతం థ్రిల్ మీద నడిపిస్తూ మంచి క్రైమ్ ని డిజైన్ చేసినట్టు ఉన్నారు. అనసూయదే ప్రధాన పాత్ర కాబట్టి తన చుట్టూనే కథనాన్ని నడిపించారు. ధన్ రాజ్ - వెన్నెల కిషోర్ కామెడీ పార్ట్ తీసుకోగా అవసరాల శ్రీనివాస్-పృథ్వి రాజ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందిస్తుండగా రోషన్ సాలూర్ సమకూర్చారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల దర్శకత్వం మెయిన్ పాయింట్ కి కట్టుబడి ఎక్కడా డీవియేట్ కాకుండా ఆసక్తికరంగా సినిమాను మలిచినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఒకవేళ మెయిన్ కంటెంట్ కూడా ఇలాగె ఉంటే అనసూయకు సోలో హిట్ దక్కినట్టే. ఆగస్ట్ 9న విడుదల కానున్న కథనం మీద అంచనాలు వచ్చేలా ట్రైలర్ ని కట్ చేయడం విశేషం



Full View
Tags:    

Similar News