ఫొటోటాక్ : దాక్షాయణి జబర్దస్త్‌ హాట్ ఫోజ్‌

Update: 2022-01-07 01:30 GMT
జబర్దస్త్‌ హాట్ యాంకర్‌ అనసూయ సినిమాలతో మరింత బిజీ అయ్యింది. ఒక వైపు హీరోయిన్ గా నటించడంతో పాటు మరో వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఉంది. పుష్ప సినిమా లో అనసూయ నెగటివ్‌ షేడ్స్ లో కనిపించిన విషయం తెల్సిందే. రెండవ పార్ట్‌ లో అనసూయ పాత్ర మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సునీల్ భార్య గా అనసూయ నటించిన తీరు కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అనసూయ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా బుల్లి తెర పై అనసూయ హడావుడి బాగానే ఉంటుంది. జబర్దస్త్‌ లో ఈ అమ్మడు రెండు మూడు వారాల పాటు కనిపించకపోవడంతో పూర్తిగా సినిమాలకే పరిమితం అంటూ వార్తలు వచ్చాయి. కాని జబర్దస్త్‌ లో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రతి గురు వారం కూడా ఈ అమ్మడు ఆ వీక్ ఎపిసోడ్‌ కు సంబంధించిన ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో సారి అనసూయ ఆ ఫొటో షూట్‌ ను షేర్ చేసింది. దాక్షాయణి పాత్రలో అలరించిన అనసూయ తాజా ఫొటో షూట్‌ తో మరింత వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలుగు లో ఇప్పటి వరకు ఈ అమ్మడి క్రేజ్‌ భారీగా ఉండేది. అయితే పుష్ప సినిమా ఇతర భాషల్లో కూడా భారీగా క్రేజ్ ను దక్కించుకుంది. అనసూయ ముందు ముందు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అందం లో ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ఉంది. తెలుగు లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం చాలా ఆచితూచి దాక్షాయణి వంటి పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. రంగమ్మత్త స్థాయిలో దాక్షాయణి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాక్షాయణి పాత్ర సినిమా లో ప్రధానంగా దర్శకుడు సుకుమార్‌ చూపించాడు. సెకండ్‌ పార్ట్‌ లో ఆమె పాత్రను మరింత ఆకట్టుకునేలా చూపిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News