డైలాగ్ ని లీక్ చేసిన అనసూయ

Update: 2017-09-04 17:18 GMT
ఒకప్పుడు టివి యాంకర్స్ ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు జనాలు. కానీ ప్రస్తుత రోజుల్లో యాంకర్స్ చేస్తున్న షోలు పాపులర్ అవుతుండడంతో వారు కూడా స్టార్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా లేడి యాంకర్స్ అయితే బుల్లితెరపైనే కాస్త ఘాటుగా కనిపించడంతో వారి వల్ల కూడా ఓ రకంగా షోలకి రేటింగ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో తెలుగు బుల్లి తెరపై అందరిని ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ అనసూయ. షోలతోనే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసి అలరించింది.

క్షణం సినిమాలో కూడా ఓ మంచి పాత్రతో అందరిని మెప్పించి.. ప్రస్తుతం అనసూయ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న "రంగస్థలం 1985" సినిమాలో కనిపించనుంది. రిసేంట్ గా ఆ సినిమాలో అనసూయ తన పాత్రకు సంబందించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డైలాగ్ ని కూడా లీక్ చేసేసింది. అదేమిటంటే.. 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి ఉరుకో '.. అని ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలిపింది. అయితే ఈ అనసూయ ట్వీట్ కి రామ్ చరణ్ అభిమానులు ఫిదా అవుతుండగా.. మిగతా వారి నుంచి భారీ స్థాయిలో అమ్మడు నెగిటివ్ కామెంట్స్ ను అందుకుంటోంది.

మొన్నటి వరకు ఈ అమ్మడి సొగసులకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమాపై ఫోకస్ చేసి విజయ్ దేవరకొండ డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందో అప్పటి నుంచి అమ్మడిపై నెగిటివ్ కామెంట్స్ తీవ్ర స్థాయిలో మొదలయ్యాయి. దీంతో ఆమె ఏ విధమైన పోస్ట్ చేసినా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. అది సంగతి.
Tags:    

Similar News