చిన్నపిల్లలా అనసూయ గేమ్స్

Update: 2017-06-03 04:42 GMT
ఉభయ తెలుగు రాష్ట్రాలలో యూత్ ఎక్కువ గా చూసే షో జబర్దస్త్. ఈ షో లో ఎడల్ట్ కామిడీ చేసే వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారో..  వ్యాఖ్యాతగా చేస్తున్న అనసూయ కూడా తన చలాకీ మాటలతో తన గ్లామరసంతో చాలామందిని కట్టిపడేస్తుంది. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు తగ్గినా కూడా.. బుల్లితెరపై మాత్రం సత్తా చాటుతోంది.

ఆమెను చూసిన ఎవరైనా ఆమెకు పెళ్ళైందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకోరు. ఇకపోతే ఎంత పెద్దవాళ్లమైనా చిన్నతనం పూర్తిగా ఎవ్వరకి పోదూ. ప్రతివారికి  సరదాగా అందరనీ మరిచి ఆటలాడుకోవాలి అని ఉంటుంది. అనసూయ కూడా ఇక్కడ అలానే తన పిల్లలు తో బయటకు వెళ్లినప్పుడు వాళ్లతోపాటుగా కలిసి ఆడి అందరితో శబాష్ పిల్ల అనిపించుకుంది. పిల్లలుతో పాటు గా ఒక వీడియొ గేమ్ ఆడుతూ బైక్ ని చాలా ఏకాగ్రతతో నడుపుతూ  కనిపించింది. గేమ్ లో వాళ్ళకు గట్టి పొట్టినే ఇచ్చినట్లు ఉంది. పిల్లలు తెలివిగా వాళ్ళ అమ్మను తప్పు దారి పాటించే పనిలో ఉన్నా అవి ఏవి పట్టించుకోకుండా బాగా ఆడిందట అనసూయ.

సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్‌ సినిమాలో సుకుమార్ ఇచ్చిన రోల్ తో తన కెరియర్ పూర్తిగా టర్న్ అవుతుంది అని ఆశపడుతుంది అనసూయ. చూద్దాం ఏమవుతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News