రంగ‌మ్మ‌త్త అలియాస్ బందిపోటు రాణి?

Update: 2020-01-18 14:30 GMT
ఇండ‌స్ట్రీ హిట్ చిత్రం `రంగ‌స్థ‌లం` స‌క్సెస్ లో చ‌ర‌ణ్ - స‌మంత‌ల‌కు ధీటుగా అన‌సూయ పాత్ర‌కు భాగ‌స్వామ్యం ఉంద‌ని మెగా ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. అన‌సూయ‌కు రంగ‌మ్మ‌త్త గా ద‌క్కిన‌ పాపులారిటీ ఊహించ‌ని క్రేజును పెంచింది. న‌టిగా మ‌రిన్ని అవ‌కాశాలు తెచ్చిపెడుతోంది. యాంక‌ర్ గా కొన‌సాగుతూనే పెద్ద తెర‌పైనా బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతోంది. తాజాగా అన‌సూయ‌కు సుకుమార్ మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అన‌సూయ కోసం సుక్కూ ఓ లేడీ విల‌న్ పాత్ర‌ను క్రియేట్ చేశార‌ట‌.

ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మందన న‌టిస్తోండ‌గా.. విల‌న్ గుంపు బండిట్ క్వీన్ గా అన‌సూయ క‌నిపించ‌నుందట‌. అయితే ఇందులో అన‌సూయ వేష‌ధార‌ణ స‌హా ఆహార్యంలో నెగిటిడ్ షేడ్ గుండెల్ని కొల్ల‌గొడుతుంద‌న్న లీక్ అందింది. రంగ‌మ్మ‌త్త  పాత్ర కంటే మ‌రింత రంజుగా ఈ పాత్ర‌ను మ‌లుస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.  రంగ‌మ్మ‌త్త గా అన‌సూయ న‌ట‌న‌లో ఈజ్ క‌నిపెట్టిన సుక్కూ ఈసారి త‌న‌ ఫ‌రిధిని పెంచి చూపిస్తార‌ట‌. ఇటీవ‌లే సుకుమార్ అన‌సూయ‌కు పాత్ర గురించి వివ‌రించాడుట‌.

ఊహించ‌ని ఈ జాక్ పాట్ కి అన‌సూయ‌ ఎంతో ఎగ్జ‌యిట్ మెంట్ చూపించిందిట‌. రంగ‌మ్మ‌త్త పాత్ర‌ను మించి త‌న కెరీర్ లో  ది బెస్ట్ గా  నిలిచిపోతుంద‌న్న కాన్ఫిడెన్స్ త‌న‌కు ఉందిట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నున్న చిత్ర‌మిది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చె నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. స్మ‌గ్లింగ్ నేప‌థ్యం స్టోరీ కావ‌డంతో బ‌న్నీ పాత్ర స‌హా చాలా క్యారెక్ట‌ర్లు మాస్ గానే క‌నిపించ‌నున్నాయ‌ని స‌మాచారం. చిత్తూరు యాక్సెంట్ అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో  లోక‌ల్ గా అక్క‌డే యూ ట్యూబ్ లో ఫేమ‌స్ అయిన కొంత మంది ఔత్సాహికుల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.



 
    
    
    

Tags:    

Similar News