'మహా సముద్రం'లో అనసూయ స్పెషల్‌ హీట్

Update: 2021-03-21 07:02 GMT
శర్వానంద్‌ హీరోగా సిద్దార్థ కీలక పాత్రలో ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్ మరియు పబ్లిసిటీ మెటీరియల్‌ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను మరింతగా మాస్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఒక మాంచి మాస్ మసాలా ఐటెం సాంగ్‌ ను దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఐటెం సాంగ్ ను ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ తో చేయించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో పాయల్‌ స్థానంలో ఆ ఐటెం సాంగ్‌ ను జబర్దస్త్‌ ముద్దుగుమ్మ అనసూయతో చేయించబోతున్నట్లుగా చెబుతున్నారు.

అనసూయ ఐటెం సాంగ్ లు చేయను అంటూనే ఇటీవల చావు కబురు చల్లగా సినిమాలో చేసిన విషయం తెల్సిందే. ఐటెం సాంగ్ లు అంటే ఒప్పుకోకుండా ప్రత్యేక పాట అంటూ చెప్పుకుంటున్న అనసూయ 'మహా సముద్రం' సినిమాలో కూడా ప్రత్యేక పాటను చేసేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. చావు కబురు చల్లగా లో చీర కట్టులో చాలా హాట్ గా కనిపించిన అనసూయ మహా సముద్రం కు కూడా ఆ ప్రత్యేక పాటతో హీట్ పెంచే ప్రయత్నం చేయబోతుందట. చావు కబురు చల్లగా సినిమాకు అనసూయ వల్ల ఖచ్చితంగా అదనపు పబ్లిసిటీ దక్కిందని చెప్పుకోవచ్చు. అందుకే అనసూయను మహా సముద్రం కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News