అనసూయ సూక్తులు మెగాఫ్యాన్స్ కేనా?
వరుసగా రెండు సూపర్ సక్సెస్ లు సాధించిన ఎవరైనా సరే.. వాటిని ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉంటారు. ఆ టైంలో వచ్చే విమర్శలను కనీసం పట్టించుకోరు. కానీ జబర్దస్త్ అనసూయ మాత్రం ఇంకా వాటినే పట్టుకువేళ్లాడుతోంది. సోగ్గాడే చిన్ని నాయనలో చిన్ని రోల్ అయినా క్లిక్ అయింది, క్షణంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర అయినా అనసూయ సెట్ అయింది.
రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాక కూడా.. ఇంకా విమర్శకుల గురించి మాట్లాడుతూనే ఉంది. తన గురువు చెప్పిన దాని ప్రకారం.. ఇలాంటి వాళ్లను పట్టించుకోనవసరం లేదు అన్నది అనసూయ ఉవాచ. “నేను ఏదైనా సాధించగలననే నమ్మకం నాకుంది. చెయ్యడం, చెయ్యకపోవడం రెండూ నా ఇష్టం. 'ఎవరి పాపాన వారే పోతారు, నువ్వెందుకు బురదలో రాళ్ల చల్లటం' అని మా గురువు చెప్పేవారు. అందరూ ప్రశాంతంగా ఉండండి” అంటూ ఉపదేశాలు కూడా ఇచ్చేసింది అనసూయ. తనను ఎప్పుడూ అభిమానించన వాళ్లకి మాత్రం బోలెడన్ని థాంక్సులు, హగ్గులు అని కూడా చెప్పింది లెండి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో వచ్చినపుడు చేయనంది.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా దాదాపు ఇదే రిపీటైంది. బంపర్ ఆఫర్ వస్తే వద్దంటుందా అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తుంటే.. చెయ్యడం చెయ్యకపోవడం నా ఇష్టం, ఎవరి పాపాన వాళ్లే పోతారు కదా.. వదిలెయ్యండి అంటోంది అనసూయ.. అదీ సందతి.