అనసూయ 'థ్యాంక్ యు బ్రదర్' కాపీనా..?
యాంకర్ అనసూయ భరద్వాజ్ - అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ''థ్యాంక్ యు బ్రదర్''. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో థియేటర్లు క్లోజ్ అవుతుండటంతో ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ ఆసక్తిని కలిగించాయి. అయితే అదే సమయంలో ఇది నైజీరియన్ మూవీకి కాపీ అనే కామెంట్స్ వస్తున్నాయి.
రెండేళ్ల క్రితం వచ్చిన 'ఎలివేటర్ బేబీ' అనే సినిమాకి అనుకరణగా ''థ్యాంక్ యు బ్రదర్'' చిత్రం ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొద్ది మార్పులతో అదే చిత్రాన్ని తీశారని అంటున్నారు. అయితే ఇది కాపీ నా? లేదా రైట్స్ తీసుకొని రీమేక్ చేసారా?, అసలు ఈ రెండింటికి పోలిక ఉందా? అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
కాగా, జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి - తారకనాథ్ బొమ్మిరెడ్డిలు 'థ్యాంక్ యు బ్రదర్' సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వైవా హర్ష - అర్చనా అనంత్ - అనీష్ కురువిల్లా - మౌనికా రెడ్డి - ఆదర్శ్ బాలకృష్ణ - కాదంబరి కిరణ్ - అన్నపూర్ణ - బాబీ రాఘవేంద్ర - సమీర్ ఇతర పాత్రలు పోషించారు.