అనసూయ.. ఇలా చేసిందేంటి?

Update: 2018-02-07 04:46 GMT
సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రెటీలకు హేట్ మెసేజులన్నవి మామూలే. అందులోనూ అనసూయ లాంటి కాంట్రవర్శల్ యాంకర్లు ఇలాంటి వాటికి ఇప్పటికే బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్లు ఎన్నోసార్లు ట్రోల్ చేశారు. అప్పట్లో అల్లు అర్జున్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో.. బన్నీ ఫ్యాన్స్ ఏ రేంజిలో ఆమెను ఆడుకున్నారో తెలిసిందే. అలాంటి సమయంలోనూ బలంగా నిలబడిన అనసూయ.. ఇప్పుడు ఒక ఇష్యూతో ట్విట్టర్-ఫేస్ బుక్ రెండు వదిలేసి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ పిల్లాడి మొబైల్ ను అనసూయ పగలగొట్టిందన్న ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ పిల్లాడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. హైదరాబాద్ పోలీస్ దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ.. అనసూయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టడం.. అందుకామె సెటైరిగ్గా స్పందించడం.. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని.. తన గురించి దుష్ప్రచారం జరుగుతోందని అనడం తెలిసిన సంగతే. ఐతే అనసూయ ఎంతగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో తనదే తప్పన్నట్లుగా నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్.. హేట్ మెసేజుల ధాటికి అనసూయ ట్విట్టర్-ఫేస్ బుక్ వదిలి వెళ్లిపోయే పరిస్థితి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొంటూ తన వాదనను గట్టిగా వినిపించిన అనసూయ.. ఇప్పుడు మాత్రం ఇలా పలాయనం చిత్తగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
Tags:    

Similar News