ఈ మధ్య టీవీ యాంకర్లు వెండితెరపైకి వచ్చేయడం అనే ట్రెండ్ బాగానే నడుస్తోంది. బుల్లితెరపై ఫేమ్ సంపాదించుకుని.. దాన్ని ఉపయోగించుకుని వెండితెరపై వెలిగిపోవాలనే ఐడియా అంతో ఇంతో బాగానే వర్కవుట్ అవుతోంది. జబర్దస్త్ బ్యూటీస్ గా పేరొందిన అనసూయ.. రష్మి.. ఆ తర్వాత శ్రీముఖి ఇలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
కానీ అనసూయ.. రష్మీలు టీవీలో చూపించిన గ్లామర్ కు మరెన్నో రెట్లు సిల్వర్ స్క్రీన్ పై చూపించేస్తున్నారు. శ్రీముఖి కూడా అంతో ఇంతో గ్లామర్ ను బేస్ చేసుకునే అవకాశాలు పుచ్చుకుంటోంది. అంటే సినిమా కలను నెరవేర్చుకునేందుకు.. గ్లామర్ మీదనే తెగ ఆధారపడుతున్నారు. కాని లాస్య మాత్రం ఈ విషయంలో నిర్మొహమాటంగా నో అంటోంది. త్వరలో విడుదల కానున్న 'రాజా మీరు కేక' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న లాస్య.. 'నేను గ్లామర్ రోల్స్ చేయను. ఒక వేళ పెర్ఫామెన్స్ కు అవకాశం ఉన్న పాత్రయితే కచ్చితంగా చేస్తాను. గ్లామర్ రోల్స్ నేను చేయబోనంటూ.. దర్శకులకు నేను స్ట్రిక్ట్ గా ఇప్పటికే చెప్పేశాను' అంటోంది లాస్య
'రాజా మీరు కేకలో నేను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర పోషిస్తున్నాను. నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ ఇది' అంటున్న లాస్య.. యాంకరింగ్ కి సినిమాలకు చాలా తేడా ఉంటుందని.. యాంకరింగ్ కు ఎనర్జీ లెవెల్స్ తో పాటు అప్పటికప్పుడు స్పందించగలగాలని.. అదే యాక్టింగ్ కు మాత్రం చాలా తేడా ఉంటుందని అంటోంది. తన దగ్గరకు వచ్చిన ప్రతీ స్క్రిప్ట్ ను భర్త మంజునాథ్ కు చెబుతానని.. తనో మంచి జడ్జ్ అంటూ కితాబు ఇచ్చేసింది లాస్య.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/