తెలుగులో చాలామంది యాంకర్లు ఉన్నా..కొంతమందికి ఉండే ఫేం అంతాఇంతా కాదు. వారికి సంబంధించిన వార్తలు తరచూ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హడావుడి చేస్తుంటాయి. అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న యాంకర్ లాస్య. బుల్లితెర మీద పద్ధతిగా కనిపించే లాస్యకు.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు సంబంధించి బోలెడన్ని న్యూస్ లు కనిపిస్తాయి. వాటిల్లో నిజం పాళ్లు ఎంతన్నది పక్కన పెడితే.. వార్తలకు మాత్రం కొదవు ఉండదు.
ఈ యాంకర్ చిన్నదానికి పెళ్లి అయ్యే వరకూ వారితో వీరితో లింకేసి వార్తలు వండేసిన వారి ఉపాధికి దెబ్బేస్తూ.. మూడు నెలల క్రితం మంజునాథ్ అనే మరాఠా కుర్రాడిని పెళ్లి చేసుకుంది. అమ్మడి పెళ్లితే.. ఆమె మీద వార్తలతో బతికేసే వారి పరిస్థితి ఏమిటన్న సందేహానికి సమాధానం లభించేలా సరికొత్త ఫేక్ న్యూస్ లు రావటం షురూ అయ్యాయి.
వీటి తీవ్రత ఎంతలా మారిందంటే.. లాస్యనే సీన్లోకి వచ్చేసి.. వామ్మో.. వామ్మో.. ఇవెక్కడి ఫేక్ న్యూస్ ల్రా బాబాయో అనేసింది. పెళ్లి అయి మూడు నెలలు అయ్యిందో లేదో.. లాస్య ప్రస్తుతం గర్భవతి అని.. అందుకే కొత్త కమిట్ మెంట్స్కు ఓకే చెప్పటం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చేయటంతో.. బాబోయ్.. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారికి దండేసి దండం పెట్టాలి దేవుడా అంటూ ట్వీట్ చేసేసి.. తన అసహనాన్ని ముద్దు ముద్దుగా చెప్పేసింది. ఏదోలా లాస్యను న్యూస్ లోకి లాగకుండా ఉండలేకపోవటం ఏమిటో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/