యాంకర్ ప్రదీప్.. బుల్లితెర టాప్ యాంకర్.. ఆడపా దడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ ఫుల్ బిజీగా.. ప్రొఫెషనల్ గా తీరిక లేని షెడ్యూల్ తో ఉన్నాడు.. ఏ సినిమా ఫంక్షన్ అయినా.. టీవీ కార్యక్రమమైనా సరే ప్రదీప్ లేకపోతే ఆ షో రక్తికట్టని పరిస్థితి నెలకొంది. తెలుగులో యాంకరింగ్ పేరు వినిపిస్తే మొదట వినిపించేది సుమ పేరు అయితే ఆ తర్వాత వినిపించే పేరు ప్రదీప్ దే.. ప్రదీప్ స్టైల్, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలు సైతం ప్రదీప్ షో అంటే ఓకే అంటూ వచ్చేస్తారు. అలాంటి ప్రదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కు ఇంత వరకు పెళ్లి కాకపోవడానికి.. ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి కెరీరే కారణమని తెలుస్తోంది. యాంకర్ గా ప్రదీప్ హిట్ అయ్యాక అతడికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. వాటిని చేసుకుంటూ పోయాడు. షూటింగ్ లతో బిజీగా మారాడు. కనీసం ఇంట్లో ఉండడానికి కూడా టైం ఉండేది కాదట.. కుప్పలుగా డబ్బు వచ్చి పడింది. అందుకే ఆ సమయంలో అమ్మాయిల గురించి ఆలోచించడం.. లవ్ లో పడడం లాంటివి చేయలేదు. పెళ్లి అంటే పెద్ద తంతు.. పెళ్లి కూతురును చూడాలి.. వాళ్ల సంబంధం నచ్చాలి. తల్లిదండ్రులు, ఆస్తుల గురించి తెలుసుకోవాలి.. అందుకే అంత టైం లేకపోవడంతో ప్రదీప్ కు పెళ్లి సంబంధాలు చూసి చూసి వారి తల్లిదండ్రులు విసిగిపోయి పెళ్లి నిర్ణయాన్ని ప్రదీప్ కే వదిలేశాడట..
నిజానికి ప్రదీప్ యాంకర్ కాకముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆమెను తలుచుకొని ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాటపాడి గుర్తుచేసుకొని కన్నీల్లు కార్చాడు. ఆ సమయంలో ఉపాధి లేక.. పోషించలేక నిరుద్యోగిగా ఉండడంతో ఆమెను వదిలేయాల్సి వచ్చిందని.. ప్రస్తుతం పిల్లాపాపలతో ఆమె ఉందని.. ఆమె పేరు చెప్పలేదు ప్రదీప్. ఆ తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా ప్రదీప్ మాత్రం పెళ్లికి నో చెబుతూనే ఉన్నాడు. బహుశా ఆమెనే ప్రదీప్ మనుసులో ఉండిపోవచ్చు అంటున్నారు.
ప్రస్తుతం ప్రదీప్ కు 35 ఏళ్లు వచ్చాయట. అందుకే తాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆ మధ్య స్వయంవరం ప్రకటించేశాడు. ఈ స్వయంవరంలో కాబోయే భార్యను ఎంపిక చేస్తానని మాట తప్పాడు... బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేశాడు. ఇప్పటికైనా ప్రదీప్ కు సంబంధం కుదురుతుందా.. ఆయన మనసు దోచే అమ్మాయి లభిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.