బుల్లితెర గంగుబాయ్.. మాటల్లేవ్ అంతే..!

Update: 2022-11-09 05:30 GMT
తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్స్ లో తన చలాకీతనంతో ప్రేక్షకులకు తక్కువ టైం లోనే దగ్గరైంది శ్రీముఖి. మొదట్లో సినిమాల్లో నటించాలని అనుకున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా చేసింది. ఇలానే ఉంటే కరెక్ట్ కాదు అనుకుని స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అయ్యింది. ఈటీవీ పటాస్ షో శ్రీముఖి కెరియర్ కి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ షో ద్వారా అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ 3లో కూడా శ్రీముఖి సందడి చేసింది.

ఆ సీజన్ లో రన్నరప్ గా నిలిచింది శ్రీముఖి. రకరకాల షోస్, ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ తో శ్రీముఖి సూపర్ ఫాం లో ఉంది. అయితే ఈమధ్య గ్లామర్ షోలో టాప్ లేపేస్తున్న శ్రీముఖి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

లేటెస్ట్ గా మరో కొత్త అవతారం ఎత్తింది శ్రీముఖి. గంగుబాయ్ కటియావాడి సినిమాలో అలియా భట్ లా మారిపోయింది శ్రీముఖి. వైట్ కలర్ శారీ.. బ్లాక్ గాగుల్స్.. అచ్చం గుంగుబాయ్ ని దించేసిందని చెప్పొచ్చు. బుల్లితెర గంగుబాయ్ గా మారి ఆడియన్స్ ని అలరిస్తుంది శ్రీముఖి.

ఇక అనసూయ తరహాలో తను కూడా సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయింది. అందుకే ఈమధ్య వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. యాంకర్ గా, హోస్ట్ గా స్మాల్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపిస్తున్న శ్రీముఖి తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు క్రేజీ ఫోటో షూట్స్ చేస్తుంది.

సినిమాల్లో సిస్టర్స్ రోల్స్ కాకుండా ఇక మీదట ఇంపార్టెంట్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయ్యిందట. అందుకే తనలో మరో యాంగిల్ ని చూపిస్తుంది అమ్మడు. యాంకర్స్  లో శ్రీముఖి ఎనర్జీని మ్యాచ్ చేఏసే మరో యాంకర్ లేరని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో మాత్రం శ్రీముఖి అదరగొట్టేసింది. గంగుబాయ్ గా మారిన శ్రీముఖి చూసి మాటల్లేవ్ అంతే అనేస్తున్నారు నెటిజెన్లు. ఈమధ్య స్పైసీ ఫోటోలతో సూపర్ అనేలా చేస్తున్న శ్రీముఖి ఇలా గంగుబాయ్ లుక్ తో కేక పెట్టించేసింది. ఏది ఏమైనా తన టాలెంట్ ఆడియన్స్ కి చూపించాలని శ్రీముఖి పడుతున్న తపన చాలా బాగుంది. ఆహాలో డ్యాన్స్ ఐకాన్ షోకి వన్ ఆఫ్ ది జడ్జ్ గా శ్రీముఖి చేస్తుంది. ఆ షో కోసమే రకరకాల గెటప్స్ లో అమ్మడు కనిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News