ఇంతకీ ‘శాతకర్ణి’కి ఆ ఆఫర్ ఉందా లేదా?

Update: 2017-01-05 19:30 GMT
మనం మరిచిపోయిన ఒక మహా చక్రవర్తి కథకు తెరరూపం ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ క్రిష్. ఇది నిజంగా ఒక సాహసోపేత.. గొప్ప ప్రయత్నమే. ఇలాంటి ప్రయత్నాలకు అందరూ సహకారం అందించాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి.. ఈ సినిమాకున్న మార్కెట్ పరిధిని కూడా మించి భారీ ఖర్చుతో సినిమాను పూర్తి చేశాడు క్రిష్.  ఐతే సంక్రాంతికి తీవ్ర పోటీ మధ్య రిలీజవుతున్న ఈ సినిమా ఆ స్థాయిలో ఆడుతుందా అంటే సందేహమే.

ఈ నేపథ్యంలో క్రిష్ బయటపడటానికి ఉన్న మార్గం పన్ను మిహాయింపు. ఇలాంటి మంచి ప్రయత్నాలకు కచ్చితంగా పన్ను మినహాయింపు ఇవ్వాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. ‘శాతకర్ణి’కి పన్ను మినహాయింపు ఇవ్వడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓ దశలో పన్ను మినహాయింపుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందన్నారు. కానీ నిజంగా ఈ సినిమా పన్ను మినహాయింపుతో రిలీజవుతోందా అంటే క్లారిటీ లేదు. అదే నిజమైతే దాని గురించి అధికారిక ప్రకటన.. చిత్ర బృందం నుంచి థ్యాంక్స్ స్టేట్మెంట్లు వచ్చి ఉండాలి. బాలయ్య బావ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఏపీలో కచ్చితంగా పన్ను మినహాయింపు వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ కూడా ఈ విషయంలో సానుకూలంగానే స్పందించే అవకాశముంది. క్రిష్ చేసిన గొప్ప ప్రయత్నానికి ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం ఉంటుందనే ఆశిద్దాం మరి. అదే జరిగితే ‘శాతకర్ణి’కి గొప్ప ఊరటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News