హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీకి సమాంతరంగా మరో కొత్త టాలీవుడ్ ను నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేస్తామన్నది సీఎం చంద్రబాబు చేసిన వాగ్ధానం. రాజధాని అమరావతిలోనే అన్ని పరిశ్రమల్ని ఒకేచోట పెట్టడం కంటే పరిపాలనా వికేంద్రీకరణ నిబద్ధతతో ఒక్కో ఇండస్ట్రీని ఒక్కోచోట సెటప్ చేస్తామని తేదేపా అధినేత అప్పట్లో వేదికలెక్కి వాక్బాణాలు విసిరారు. ఐటీ - పరిశ్రమలు - సినీరంగం విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ప్రజలకు వివరించారు. తిరుపతి - విశాఖ - విజయవాడ కేంద్రంగా ఐటీ విస్తరిస్తుందన్నారు. ఆ క్రమంలోనే సినీపరిశ్రమను వైజాగ్ లో సెటప్ చేస్తామని ప్రకటించారు. మిగతా వాటి మాటేమో కానీ వైజాగ్ ఫిలిం ఇండస్ట్రీ వాగ్ధానం అమల్లో మాత్రం బాబు పని తీరు జీరో అని తేలిపోయింది. ఏపీఎఫ్ డీసీ(సినిమా అభివృద్ధి సంస్థ) నుంచి తామరతంపరగా ప్రకటనలు అయితే వస్తాయి కానీ, అవేవీ అమలు కావన్న సంగతి అందరికీ అర్థమైపోయింది.
అసలు చంద్రబాబు మైండ్ లో ఏం ఉంది? కొత్త టాలీవుడ్ ని నిర్మించాలన్న పట్టుదల ఆయనకు ఉందా? అంటే అసలు ఆ ఆలోచనే లేదని సినీ పెద్దలు కొందరు పెదవి విరిచేస్తున్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ కి తెలుగు సినీపరిశ్రమ తరలి రావడానికి కారణం భాష పరమైన వైరుధ్యం. కానీ ఇప్పుడు తెలుగు వాళ్లమే కాబట్టి ఆ అవసరం ఉండదని కొందరు వాదిస్తుంటే - అసలు పరిశ్రమను పెట్టాలన్న చిత్తశుద్ధి కొత్త రాష్ట్రంలోని ప్రభుత్వానికి ఉంటే - అదేమీ అడ్డే కాదని - అసలు కష్టమేం కాదన్న వాదనా మరోవైపు బలంగా వినిపిస్తోంది.
ఇటీవలే `తుపాకి` ఎక్స్ క్లూజివ్ గా కొందరు సినీ పెద్దల్ని వైజాగ్ టాలీవుడ్ విషయమై ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు పెదవి విరుపు సమాధానాలే కానీ - అస్సలు కొత్త టాలీవుడ్ ఉంటుందా? ఎవరు పెడతారు? అదేం లేదు.. ఎవరూ పట్టించుకోవడం లేదు అన్న సమాధానాలే వినిపించాయి. ప్రభుత్వం తరపున ప్రయత్నం గుండు సున్నా అన్న సమాధానాలే వినిపించాయి. ఓ మెగా అగ్ర నిర్మాత వైజాగ్ లో టాలీవుడ్ బలంగా వేళ్లూనుకోవాలని భావించారు. అందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం తరపున పెద్ద లొసుగు ఉందని అర్థమై సైలెంట్ అయిపోయారు. అసలు వైజాగ్ టాలీవుడ్ ఉందా? అంటే పళ్లు విరగ్గొట్టే సమాధానమే ఇచ్చారు. ఆ విషయంపై పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. ఛస్.. అసలు దానిగురించే మాట్లాడొద్దు! అన్నట్టే ఆయన వాలకం కనిపించింది.
ఇండస్ట్రీలో ఆనలుగురిలో ఒక ప్రముఖుడిని ప్రశ్నించినా ఇదే తీరు. స్టూడియో వోనర్ కం ఎగ్జిబిటర్ కం డిస్ట్రిబ్యూటర్ కం అగ్రనిర్మాతను ప్రశ్నిస్తే ఇంచుమించు ఇదే సమాధానం వినిపించింది. అసలు ఆ ఊపేది? ప‌్రయత్నం ఎక్కడ? అదంతా ఉత్త ప్రశ్న. ఆ మాటే ఎత్తొద్దు అంటూ నాలుక మడతేసి ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. అసలు ఏపీ ప్రభుత్వంలో కానీ - చంద్రబాబులో కానీ.. ఆ ఊపు అస్సలు కనిపించలేదు.. ఏపీలో టాలీవుడ్ ని పెట్టాలన్న దాంట్లో ఎలాంటి నిజాయితీ లేదు. ప్రజాకోణంలో ఆలోచనే లేదు. గ్లామర్ పరిశ్రమ ఉపాధిని ఏపీ ప్రజలకు కల్పించాలన్న తపన అసలే లేదు. ప్రయత్నంలో ఎంత మాత్రం జెన్యూనిటీ అస్సలు లేనేలేదు.. అంటూ ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కుళ్లు పోటు పొడిచింది. ఆయన ముఖ కవలికల్లో ఉద్ధేశం భయానకంగా ఉంది. ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు ఇంకా వైజాగ్ లోనే సినీఇండస్ట్రీని పెడుతున్నారని అమాయకంగా ఎదురు చూస్తున్నారు. కానీ దానికి చంద్రబాబు ప్రభుత్వమే పెద్ద అడ్డుగోడ. ఇకపోతే ఎవరైనా వైజాగ్ లో స్టూడియోలు పెడతామని ముందుకొస్తే ప్రభుత్వంలోని కొందరు పెద్దలే నీరుగార్చే సన్నివేశం ఉందిట. ఇటీవలే నటుడు కం ఎంపీ మురళీమోహన్ ని కొత్త టాలీవుడ్ గురించి ప్రశ్నిస్తే .. వైజాగ్ లో పెట్టే ఆలోచన ఉంది కానీ, నాకు పూర్తిగా తెలియదు అనేశారు. అమరావతిలోనా? వైజాగ్ లోనా? అన్నది తనకే అర్థంకాలేదని - క్లారిటీ లేదని ఆయన మాటలు క్లియర్ కట్ గా తేల్చి చెప్పాయి. పలువురు ప్రముఖ నిర్మాతల్ని వైజాగ్ టాలీవుడ్ గురించి ప్రశ్నిస్తే ఎవరికీ ఏ క్లారిటీ లేదన్నదే అట్నుంచి సమాధానం. కొత్త పరిశ్రమ సెటప్ కి అవసరమయ్యే భూములు జెన్యూన్ గా ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సినీపెద్దల్లో ఆసక్తి ఉన్నవారికి నిజాయితీగా ప్రభుత్వం సాయపడుతుందా? .. అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిని బట్టి వైజాగ్ టాలీవుడ్ ఆశలు అడియాశలేనని భావించాల్సి వస్తోంది.