కరోనా వైరస్ కారణంగా మన దేశ సిని పరిశ్రమ స్తంభించిపోయింది. అయితే పెద్ద తరహా సినిమా పనులు ఆగినా షార్ట్ ఫిలిమ్స్ తీసే యువత మాత్రం తమ బుర్రలకు పదును పెడుతూ చిన్న సినిమాలు తీసేస్తున్నారు. ఈ కరోనా కాలంలో యంగ్ జనరేషన్ క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఇంతకు ముందు సినిమా తారలతో చిన్న యాడ్ తీయాలన్నా.. భారీ సెటప్ అవసరం అయ్యేది. ఇప్పుడు అటువంటి సెట్లు తయారు చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమలో క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. జస్ట్ ఫోనుతో అన్నీ కానిస్తున్నారు. తాజాగా తమిళ హీరోయిన్ ఆండ్రియా ప్రధాన పాత్రలో 'లాక్ డౌన్' అని ఒక షార్ట్ ఫిలిం అలాగే తీశారు. మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో చూపించారట.
ఈ షార్ట్ ఫిల్మ్ కి రచన, దర్శకత్వం ఆధవ్ కన్నదాసన్. కేవలం వీడియో కాల్స్ ద్వారా అతను డైరెక్ట్ చేశాడట. అయితే షూట్ చేసింది మాత్రం వేరే వ్యక్తి.. ఆండ్రియా ఇంటికి దగ్గరలో ఉండే సినిమాటోగ్రాఫర్ నితిన్ రామ్ షూట్ చేసాడట. షూటింగ్ చేసేటప్పుడు భౌతిక దూరం పాటించారట. ఇప్పటికే తెలుగులో ఈ విధమైన షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ నటించిన కరోనా పాటను ఎవరి ఇంట్లో వారు ఉంటూ ఫోనులోనే షూట్ చేశారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మోహన్ లాల్ తదితరులు ఇదే విధంగా ఒక షార్ట్ ఫిలిం చేశారు. తెలుగులో టీవీ తారలు కూడా మరో షార్ట్ ఫిలిం చేశారు. ఈ బాటలో ఇంకెంత మంది చేరతారో చూడాలి. శివ సౌండ్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ గానే విడుదల కానున్నట్టు సమాచారం. ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.