బాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుల్లో అను మాలిక్ ఒకడు. ఆయన గురించి అనిల్ కపూర్ కొత్త కొత్త విషయాలు తెలిపాడు. సరదాకు అన్నాడో.. లేక సైటైర్లు వేశాడో కానీ.. అను మాలిక్ కొంచెం తేడా అన్నట్లుగా మాట్లాడాడు అనిల్ కపూర్. అను మాలిక్ కు తానంటే చాలా ఇష్టమని.. తనను ఫిజికల్ గా తాకాలని అతను ప్రయత్నిస్తుంటాడని అన్నాడు అనిల్ కపూర్.
ఓ అవార్డుల వేడుకలో భాగంగా అను మాలిక్.. అనిల్ కపూర్ ను ముద్దాడుతున్నట్లుగా ఉన్న ఫొటో గురించి స్పందిస్తూ అనిల్ మాట్లాడాడు. ‘‘అను మాలిక్ లవింగ్ పర్సన్. నన్ను ఎప్పుడు కలుసుకున్నా అమితంగా సంతోషపడుతుంటాడు. నన్ను ఫిజికల్ గా తాకాలని తాపత్రయ పడుతుంటాడు. ఎవరు మధ్యలో అడ్డుపడ్డా పట్టు విడవడు. ఇటీవల నన్ను ఓ అవార్డుల వేడుకలో చూడగానే గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడే ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్ కొట్టాడు. దీంతో అను నన్ను ముద్దాడుతున్నట్లుగా ఫొటో వచ్చింది. మాలిక్ కు నేనంటే ఇష్టం కాబట్టే అలా చేశాడు’’ అంటూ వివరణ ఇచ్చాడు.
ఒకప్పుడు బాలీవుడ్లో నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ఉన్న అను మాలిక్.. గత కొన్నేళ్లలో జోరు తగ్గించేశాడు. ఆయన కంపోజ్ చేసిన అనేక పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ ఏడాది అను మాలిక్ ‘బేగమ్ జాన్’.. ‘హేరా ఫేరీ-3’.. ‘జుడ్వా-2’.. ‘ఇందు సర్కార్’ సినిమాలకు సంగీతం అందించాడు.