కూతుళ్లకే కాదు సొసైటీకీ నేర్పాలి

Update: 2015-06-28 09:42 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అనీల్‌ కపూర్‌ పాఠాలు నేర్పే మాష్టారు అయ్యారు. అయితే ఈయన పాఠాలు కేవలం కూతుళ్ల వరకే పరిమితం కాదు. ఓవరాల్‌ దేశానికే విస్తరిస్తున్నాడు. ఇదే విషయంపై అనీల్‌ ముచ్చటిస్తూ కేవలం నా ముగ్గురు బిడ్డల వరకే పాఠాలు నేర్పిస్తే సరిపోతుంది.

హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌, నిర్మాత రియా కపూర్‌ ఇద్దరు కూతుళ్లకు చిన్నప్పట్నుంచి బోలెడన్ని పాఠాలు చెబుతూనే ఉన్నా. అలాగే నా కొడుకు  హర్షవర్ధన్‌ కపూర్‌ పాఠాలు నేర్చుకునే స్థాయికి ఎదిగేశాడు. కానీ దేశానికి పాఠాలు ఎవరు చెబుతారు? అందుకే నేను కూడా ఓ చెయ్యేస్తున్నా. ఇప్పటికే పదిమంది కలిసి సేవలు చేయడం మొదలుపెడితే దేశం గతిని మార్చేయొచ్చన్న కొత్త కాన్సెప్టుతో పి అండ్‌ జి ప్రారంభించాం. 450 స్కూళ్లలో పి అండ్‌ జి తరపున సేవలందుతున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్టును దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నా. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. అన్నిచోట్లా అందరికీ అవేర్‌నెస్‌ కావాలి. ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయడానికి ముందుకు రావాలి అంటూ చెప్పుకొచ్చాడు అనీల్‌ కపూర్‌.

ఇదేదో మురుగదాస్‌ 'ఠాగూర్‌' కాన్సెప్టులా లేదూ? ఏదేమైనా పెద్ద పెద్ద హీరోలందరూ ఇలా దేశం కోసం పాటుపడటం మంచి విషయమే. దేశం బాగుంటేనే కదా.. అన్నీ బాగుండేది.



Tags:    

Similar News