అనిల్ రావిపూడి.. యావరేజ్ మార్కులేనా?

Update: 2020-01-16 06:54 GMT
స్టార్ హీరోలను డీల్ చెయ్యడం కష్టమైన పని.. అంటే స్టార్ హీరోల ను భరించడం అనే ఉద్దేశం కాదు.  వారి ఇమేజ్ కి తగ్గట్టు.. ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా.. సాధారణ ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా సినిమాను తెరకెక్కించడం కత్తిమీద సామే.  డైరెక్టర్లు ఎంత ప్రతిభావంతులు అయినప్పటికీ వారిలో చాలామంది స్టార్ హీరోలను డీల్ చెయ్యడంలో తడబడతారు. ఇప్పుడు అనిల్ రావిపూడి విషయంలో కొంతవరకూ అదే జరిగింది.

దర్శకుడు అనిల్ రావిపూడికి మొదటిసారిగా 'సరిలేరు నీకెవ్వరు' తో సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.  కొన్ని అంశాలలో అనిల్ రావిపూడి మంచి మార్కులు తెచ్చుకున్నాడు కానీ కొన్ని అంశాలలో మాత్రం ఉసూరుమనిపించాడు.  అనిల్ రావిపూడి గత సినిమాలు హిట్ అయినా కానీ ఒక కంప్లయింట్ ఏంటి అంటే.. సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడం.  ఈ సినిమాలో కూడా అదే జరిగింది. పైగా ఈ సినిమాకు డిఫరెంట్ క్లైమాక్స్ ఎంచుకోవడంతో సెకండ్ హాఫ్ గ్రాఫ్ ను పైకి లేపే అవకాశం దక్కలేదు.  క్లైమాక్స్ కనుక పవర్ ఫుల్ గా ఉంటే 'సరిలేరు నీకెవ్వరు' రేంజ్ మరోలా ఉండేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు.  ఇక భారీగా ప్రమోట్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

 సినిమాలో కొన్ని ప్లస్సులు కూడా ఉన్నాయి. మహేష్ బాబును మాసుగా చూపించడం.. ఫ్యాన్స్ సంతోషపడేలా మహేష్ తో స్టెప్పులు వేయించడం లాంటివాటికి అనిల్ రావిపూడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.  అయితే సెకండ్ హాఫ్ వీక్ నెస్ ను కవర్ చేసుకోకపోవడంతో ఈ సినిమా రేంజ్ పై ప్రభావం చూపిస్తోంది.  ఇవన్నీ చూస్తుంటే అనిల్ రావిపూడికి ఈ సినిమా విషయంలో యావరేజ్ మార్కులే పడ్డాయని.. వెంటనే స్టార్ హీరోలు అవకాశం ఇవ్వకపోవచ్చని అంటున్నారు.  అనిల్ ఇప్పటికే 'F3' ప్లానింగ్ ఉందని అంటున్నారు కాబట్టి ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తేనే స్టార్ హీరోల నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.  మరి ఈసారైనా అనిల్ ఈ సెకండ్ హాఫ్ వీక్ నెస్ ను కవర్ చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. 
Tags:    

Similar News