ఎఫ్‌3.. మళ్లీ క్లారిటీ ఇచ్చిన అనీల్‌ రావిపూడి

Update: 2021-08-09 00:30 GMT
వెంకటేష్‌ ఇంకా తమన్నా జంటగా మరియు వరుణ్‌ తేజ్ మరియు మెహ్రీన్‌ జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఎఫ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అదే టీమ్‌ ఎఫ్‌ 3 సినిమాను చేస్తున్నారు. అదే నిర్మాత.. అదే దర్శకుడు హీరోలు మరియు హీరోయిన్స్ కూడా వారే అవ్వడం వల్ల ఎప్‌ 3 ఖచ్చితంగా ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ అయ్యి ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఎఫ్ 3 సినిమాను సీక్వెల్‌ గా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు సందర్బాల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు ఎఫ్‌ 2 సినిమాకు ఎఫ్ 3 సినిమా సీక్వెల్‌ కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎఫ్ 3 సినిమాలో గతంలో ఎఫ్‌ 2 లో పాత్రలు ఎలా ఉండేవో కాస్త అటు ఇటుగా అవే ఉండేవని.. అలాగే హీరోలు మరియు హీరోయిన్స్ వరుసలు మారబోతున్నాయని అంటే ఎఫ్‌ 2 లో హీరోయిన్స్ ఇద్దరు అక్క చెల్లెల్లు కాగా.. హీరోలు వారికి భర్తలుగా కనిపించారు. కాని ఈ సినిమా లో వరుసలు వేరు ఉంటాయట.

వెంకటేష్ కు జోడీగా తమన్నా మరియు వరుణ్‌ కు జోడీగా మెహ్రీన్ నే నటించబోతుంది. కాని ఎఫ్‌ 3 లో మాత్రం కథ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు అనీల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎఫ్ 2 కథకు ఎఫ్ 3 కథతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఎప్ 3 కథ పూర్తిగా విభిన్నమైనది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఎఫ్ 2 తరహాలోనే పూర్తి స్థాయి ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎప్ 3 సినిమా లో కూడా హీరోలు ఇద్దరు పండించే కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌ 2 మరియు ఎఫ్‌ 3 లో కొన్ని కామన్‌ పాయింట్స్ ఉన్నా కూడా మెయిన్‌ పాయింట్‌ మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఎఫ్ 3 లో సునీల్‌ ను అదనంగా చూడబోతున్నాం. ఆయన కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుగుతున్నామని.. త్వరలోనే ముగిస్తామని అన్నారు. ఇక ఈ సినిమా ను సెకండ్‌ వేవ్‌ కు ముందు ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అందుకు సంబంధించి అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కాని సకెండ్‌ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా వాయిదా వేస్తున్నారు. వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఎప్పటికి ప్రకటిస్తారో చూడాలి.
Tags:    

Similar News