సింగర్ ప్రేమలో పడిపోయిన అనిరుధ్...?

Update: 2023-07-11 08:00 GMT
ఈ కాలం యువత కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆయన పాటల కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన మొదట తమిళం లో ధనుష్ త్రీ మూవీ కి సంగీతం అందించి అందరిచేత వావ్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా కొలవరి పాట తో పిచ్చెక్కించాడు. అప్పటి నుంచి తమిళనాటు మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు.

కాగా, ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఓ సింగర్ తో ప్రేమ లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. గతం లోనూ అనిరుధ్ గురించి చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్నట్లు ఫోటోలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఆయన ఓ సింగర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ప్రముఖ సింగర్ జోనితా గాంధీ తో అనిరుధ్ లవ్ ఏఫైర్ నడిపిస్తున్నట్టు కోలీవుడ్ అంతా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ జోరు గా చక్కర్లు కొడుతోంది. సింగర్ జోనితా.. విజయ్ బీస్ట్ సినిమా లో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఫేమస్ అయ్యింది.  ఆమెతో అనురుధ్ సంబంధం మాత్రం కమల్ హాసన్ విక్రమ్ సినిమా తో స్ట్రాంగ్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఆసినిమా టైమ్ నుంచి కలిసి తిరగడం స్టార్ట్ చేశారట ఇద్దరు.

ఇక  అప్పటి నుంచి ఎక్కడ చూసినా..వీరే కనిపిస్తున్నారంటూ.. కోలీవుడ్ మీడియా లో న్యూస్ కాకరేపుతోంది.  అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా అక్కడికి వెళ్లిపోతుందట. పబ్లిక్ గానే వీరు కలిసి తిరుగుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు వీరిద్దరు పీకల్లోతు ప్రేమ లో మునిగిపోయారని.. త్వరలో పెళ్ళి  కూడా చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ జంట మాత్రం ఇప్పటి వరకు సంబంధించలేదు.

ప్రస్తుతం అనిరుధ్‌ 'జైలర్‌', దేవర, లియో, ఇండియన్‌2, VD12 తదితర చిత్రాల కు సంగీతం అందిస్తున్నాడు. జోనితా గాంధీ తెలుగులో ఎన్నో హిట్‌ పాటలు పాడింది.

Similar News