మావోయిస్టులు.. క్రిమినల్స్.. వచ్చి పోలీసుల ముందు లొంగిపోవడం చూస్తుంటాం. కానీ ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఈ పని చేయబోతున్నాడు. తన ప్రమేయం పెద్దగా లేకుండానే వివాదంలో చిక్కుకుని తమిళనాట మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న యంగ్ మ్యూజికల్ గన్ అనిరుధ్ రవిచందర్.. పోలీసుల ముందు లొంగిపోనున్నాడు. గత మూడు వారాలుగా తమిళనాడును కుదిపేస్తున్న ‘బీప్ సాంగ్’ వివాదంలో అనిరుధ్ కూడా పాత్రధారే. హీరో శింబు అమ్మాయిల్ని బూతులు తిడుతూ రాసుకున్న పాటకు ఇతనే స్వరాలు సమకూర్చాడు. ఐతే శింబు తన కోసం తాను రాసుకుని పాడుకున్న పాట.. బయటి ప్రపంచంలోకి వచ్చి కలకలం రేపడానికి కారణం అనిరుధే.
అనిరుధ్ ఓ హీరోకు ఈ పాటను పంపగా.. అతను వాట్సాప్ లో అందరికీ షేర్ చేసేయడంతో ఈ పాట ఇంటర్నెట్లోకి వచ్చేసింది. పెను దుమారానికి దారి తీసింది. ఐతే తన ప్రమేయం ఉన్నా లేకున్నా.. ఈ పాటకు సంబంధించిన వివాదంలో అనిరుధ్ పాత్రధారి అయిపోయాడు. ఈ గొడవ మొదలైనప్పటి నుంచి అతను ఫారిన్లోనే ఉన్నాడు. లండన్లో మ్యూజిక్ కన్సర్ట్స్ చేస్తున్నాడు. దీంతో అతడి కోసం చెన్నై పోలీసులిక్కడ వెయిట్ చేస్తున్నారు. ఐతే ఈ డ్రామాను పెద్దది చేయకుండా చెన్నైలో అడుగుపెట్టగానే పోలీసులకు లొంగిపోయి ఆ తర్వాత బెయిల్ ప్రయత్నాలు చేయబోతున్నాడు అనిరుధ్. ఒకట్రెండు రోజుల్లో అతను చెన్నైకి రానున్నాడు.