రారా థీమ్ రోరింగ్ గురూ

Update: 2019-07-19 06:58 GMT
ఒక సినిమా విజ‌యంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా కీల‌కం. సినిమా ఆద్యంతం క‌థ‌ను డ్రైవ్ చేసే థీమ్ మ్యూజిక్ స‌రిగ్గా కుదిరితే ఆడియెన్ ని క‌నెక్ట్ చేయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. స్క్రీన్ ప్లేలో త‌ప్పులున్నా.. న‌టీన‌టుల్లో మ్యాట‌ర్ లేక‌పోయినా క‌వ‌ర్ చేసేది నేప‌థ్య సంగీతం.. బీజీఎం. అందుకే ఈ విభాగం ఫెయిలైతే అంతే దారుణ‌మైన ప‌రిణామం ఉంటుంది. ఈ విష‌యంలో దర్శ‌క నిర్మాత‌లు ఎంతో అలెర్ట్ గానే ఉంటారు. సంగీత ద‌ర్శ‌కుడి పై ఆ మేర‌కు ఒత్తిడి ఉంటుంది.

అయితే ఎంత ఒత్తిడి ఉన్నా దానిని స‌వాల్ గా తీసుకుని సంగీతం అందించేవాళ్ల‌లో యువ‌సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ పేరు ప్ర‌స్థావించాలి. ప‌వ‌న్- త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ స్ట‌డ్ టీమ్ తో `అజ్ఞ‌త‌వాసి` చిత్రానికి ప‌ని చేసిన అనుభ‌వం అత‌డికి ఉంది. ఆ సినిమా ఫ్లాపైనా మ్యూజిక్ ఎక్క‌డా ఫ్లాప‌వ్వ‌లేదు. చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ ని ఇచ్చాడు అనిరుధ్. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో విక్ర‌మ్.కె- నాని బృందం ప్ర‌తిష్ఠాత్మ‌క‌ గ్యాంగ్ లీడ‌ర్ చిత్రానికి అవ‌కాశం ఇచ్చారు. ఆ ఇద్ద‌రి న‌మ్మ‌కాన్ని అనిరుధ్ నిల‌బెడుతున్నాడ‌నే తాజాగా రిలీజైన థీమ్ మ్యూజిక్ చెబుతోంది. `రారా..` (రోర్ ఆఫ్ రివెంజ‌ర్స్) అంటూ సాగే థీమ్ మ్యూజిక్ ని అద్భుతంగా కంపోజ్ చేశాడు అనిరుధ్. ముఖ్యంగా ఉర్రూత‌లూగే టీనేజీ యూత్ కి ఈ మ్యూజిక్ బాగా క‌నెక్ట‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం రారా లిరిక‌ల్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇదో త‌ర‌హా స్పీడ్ ఉన్న మిక్స్ డ్ ఇన్ స్ట్రుమెంటేష‌న్ మ్యూజిక్. పృథ్వీ ఈ గీతాన్ని ఆల‌పించారు. నాని అండ్ గ్యాంగ్ ని సినిమా ఆద్యంతం డ్రైవ్ చేసే థీమ్ ఇది.

అక్క‌డ‌క్క‌డా `బోయ్స్` సినిమాలో `నాకొక గాళ్ ఫ్రెండ్ కావ‌లెరా.. ` గీతానికి ఏ.ఆర్‌.రెహ‌మాన్ ఉప‌యోగించిన గిటార్ సౌండ్ వినిపించినా ట్యూన్ మాత్రం ఉర్రూత‌లూగిస్తోంది. అయినా స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్. రెహ‌మాన్ స్థాయి సంగీతం అందించేవాళ్లు అరుదుగా మాత్ర‌మే ఉన్నారు. హ్యారిస్ జైరాజ్.. యువ‌న్ శంక‌ర్ రాజా.. వీళ్ల స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో బాణీల్ని అందించ‌గ‌ల స‌మ‌ర్ధుడు అనిరుధ్ అన‌డంలో సందేహం లేదు. ఆ న‌మ్మ‌క‌మే గ్యాంగ్ లీడ‌ర్ టీమ్ కి ప్ల‌స్ కానుందేమో చూడాలి.

    
Full View
Tags:    

Similar News