పవన్‌ భామలో.. ఈ యాంగిల్‌ ఉందా

Update: 2016-03-13 06:36 GMT
అన్నీ కుదరితే అమ్మడు పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్ గా అదరగొట్టేసుండేది. కాని కొన్ని అనివార్య కారణాల వలన.. ఎవ్వరికీ తెలియని రీజన్స్‌ కారణంగా.. అమ్మడు ఇప్పుడు సందీప్‌ కిషన్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఎవరో గుర్తుపట్టేశారా? మీరు గుర్తుపట్టేస్తారులే.

అనీషా ఆంబ్రోస్‌. ఆమె అప్పట్లో పవన్‌ తో 'పంజా' సినిమా తీసిన ప్రొడ్యూసర్లు.. 'ఎలియాస్‌ జానకి' అంటూ ఒక సినిమా తీశారు. అందులో హీరోయిన్‌ గా చేసింది. ఆ తరువాత ఉన్నట్లుండి పవన్‌ ''సర్దార్‌'' సినిమాలో ఈమే మెయిన్‌ హీరోయిన్‌ అంటూ న్యూస్‌ వచ్చేసింది. అఫీషియల్‌ గా నిర్మాత శరత్‌ మరార్‌ ఈ విషయం కన్ఫామ్‌ చేస్తూ ప్రెస్‌ నోట్‌ కూడా ఇచ్చాడు. ఆ దెబ్బతో విమర్శలే విమర్ళలు. అసలు గోపాల గోపాల సినిమాలో టివి రిపోర్టర్‌ గా ఏ మాత్రం ఆకట్టుకోని అనీషను హీరోయిన్‌ చేస్తున్నారా అంటూ సెటైర్లు వేశారు జనాలు. కట్‌ చేస్తే.. ఈ భామను తప్పించి కాజల్‌ ను పెట్టేశారు. ఈరోస్‌ వారు సీన్‌లోకి ఎంటరయ్యాక.. సినిమాకు 80 కోట్లు ఇవ్వాలంటే హీరోయన్‌ కూడా బాగా పాపులర్‌ అమ్మాయి అయ్యుండాలి అని కండీషన్‌ పెట్టారటలే. అందుకే అనీషను తప్పించాల్సి వచ్చింది.

ఇక నిన్న జరిగిన 'రన్‌' సినిమా ఆడియో వేడుకకు.. హీరోయిన్‌ అనీషా బ్యాక్‌ లెస్‌ డ్రస్సులో మెరుస్తూ వచ్చింది. అరే.. ఈ భామలో ఇలాంటి హాట్‌ యాంగిల్‌ కూడా ఉందా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. అది సంగతి.
Tags:    

Similar News