తెలుగు తెరపై తెలుగు హీరోయిన్లు రాణించిన సందర్భాలు చాలా తక్కువ. తెలుగు హీరోయిన్లు ఒకస్థాయిని దాటేసి అందాలను ఆరబోయడానికి అంగీకరించరు. అందాలు ఆరబోయని కథానాయికలకి లభించే అవకాశాలు తక్కువ. స్కిన్ షో చేయకుండా స్టార్ హీరోయిన్లుగా వెలుగొందినవాళ్లు ఉన్నారు .. కానీ వాళ్ల సంఖ్యను వ్రేళ్లపై లెక్కించి చెప్పవచ్చు. అందువలన హీరోయిన్ అంటే ఎంతో కొంత ఎక్స్ పోజింగ్ చేయవలసిందే. మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి అంతకుమించిన మార్గం లేదు .. మంత్రం లేదు. అందువల్లనే హీరోయిన్లు అందంగా ఉండాలి .. మొహమాటాలు లేకుండా వాటిని ఆరబోయాలి.
అంజలి విషయానికొస్తే అచ్చ తెలుగు అమ్మాయి .. రాజోలు పిల్ల. అయితే తెలుగులో కంటే ముందుగా తమిళంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాతనే తెలుగులో తన జోరును మొదలుపెట్టింది. అంజలి నటన చాలా సహజంగా ఉంటుంది. ఈ అమ్మాయి కెమెరా ముందు కాదు, మన ఎదురుగా .. మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. గలగలమని మాట్లాడుతూ తెరపై తెగ సందడి చేసే ఈ అమ్మాయికి యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. తెలుగు .. తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మాయి, వీలును బట్టి మలయాళ .. కన్నడ సినిమాలను కూడా చేస్తూ వచ్చింది. అలా పుష్కర కాలానికి పైగా తన కెరియర్ ను నెట్టుకొచ్చింది.
కానీ ఈ మధ్య కాలంలో అంజలిని అదృష్టం వదిలేసిందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే తెలుగులో అవకాశాలు అడుగంటితే, తమిళంలో విజయాలు అందకుండా పోతున్నాయి. హీరోల జోడీగా ఆడిపాడినా .. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా .. ప్రత్యేక పాత్రల్లో మెరిసినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఏ భాషలో ఏ సినిమా చేసినా సక్సెస్ మాత్రం తప్పించుకుని తిరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె చేసిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా అంజలి మరోసారి అందరికీ గుర్తొస్తుందేమో .. చాలాకాలం క్రితమే తప్పిపోయిన అదృష్టం ఈ అందగత్తెను వెతుక్కుంటూ తిరిగొస్తుందేమో చూడాలి.