రాసి రంపాలుపెట్టే సీతమ్మ!!

Update: 2015-10-28 17:30 GMT
సాధారణంగా సీతమ్మ అంటే.. రాముడి భార్యే కానీ.. టాలీవుడ్ సీతమ్మ అంటే మాత్రం హీరోయిన్ అంజలినే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంత గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ భామకు. అవడానికి తెలుగమ్మాయే అయినా.. ముందు చెన్నై వెళ్లి, కోలీవుడ్ లో సత్తా చాటి, అప్పుడు తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది అంజలి. వివాదాలతో కెరీర్ ని పాడు చేసుకుంటోంది అనే ఆరోపణలు వచ్చిన సమయంలో.. జాగ్రత్త పడి మళ్లీ గాడిలో పెట్టుకుంది.

కుర్ర హీరోలకు సెట్ అయ్యే పర్సనాలిటీ కాకపోవడం ఒకవైపు, వరుసగా పెద్ద హీరోల సినిమాలే చేస్తే తర్వాత లాంగ్ కెరీర్ ఉండకపోవచ్చనే సమస్య మరోవైపు.. ఈ ప్రాబ్లెమ్స్ ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకుంటూ ఓవర్ కమ్ చేస్తోంది అంజలి. గీతాంజలి మూవీలో కేరక్టర్ ఇలాంటిదే. ప్రస్తుతం శంకరాభరణం మూవీలో ఇలాంటి విభిన్నమైన పాత్ర ఒకటి చేస్తోంది అంజలి. అది పూర్తిగా మగాళ్లను ద్వేషించే పాత్ర కావడం విశేషం. దీనికి తోడు ఈ తెలుగమ్మాయి చేస్తున్న పాత్ర ఓ బందిపోటు రోల్. అంతే కాదు.. శంకరాభరణంలో అమ్మడి గెటప్ కూడా చాలా సెక్సీగా ఉంటుందని చెబ్తున్నారు.

అంటే అందంగా ఉంటుంది, దోచుకుంటుంది, మగాళ్లను మాత్రం ద్వేషిస్తుందన్న మాట. రాసి రంపాలు పెట్టేస్తుంది కూడా. కథలోనే కాదు..  పాత్రలోనూ చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ అంజలిని సీతమ్మ రేంజ్ లో అభిమానించారు జనాలు. మరి అలాంటి గెటప్ నుంచి సెక్సీ డెకాయిట్ అంటే వర్కవుట్ అవుతుందో లేదో అనిపిస్తోంది. అదేంటీ. దెయ్యం గెటప్ వేస్తే చూడలేదా.. ఇప్పుడెందుకు చూడరు అంటారా.. అదీ కరెక్టే.
Tags:    

Similar News