సుశాంత్ మరణంపై మొన్నటి వరకు కొద్ది మందికి మాత్రమే అనుమానాలు ఉండేది. అవి కూడా బాలీవుడ్ ప్రముఖులు అయిన కరణ్ జోహార్ ఇంకా కొందరు ఆఫర్లు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకోవడం వంటివి చేయడం వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడో అప్పటి నుండి బయటకు వస్తున్న విషయాలు మొత్తం కూడా రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమెపై సుశాంత్ సన్నిహితులు ఆయన వద్ద వర్క్ చేసిన వారు ఒక్కరు ఒక్కరుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
సుశాంత్ వద్ద గతంలో పర్సనల్ అసిస్టెంట్ గా చేసిన అంకిత్ ఆచార్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాపై ఆరోపణలు గుప్పించాడు. ఆమె ప్రవర్తన ఏమాత్రం బాగుండేది కాదని ఆమె వల్ల సుశాంత్ మానసిక ప్రశాంతత కోల్పోయాడు అంటూ తేల్చి చెప్పాడు. 2019కి ముందు వరకు సుశాంత్ అకౌంట్ లో దాదాపుగా 30 కోట్ల వరకు ఉండేవని రియా మరియు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో పాటు సుశాంత్ ఇంట్లో వ్యవహారాలు అన్ని కూడా ఆమె చూసుకునేది అంటూ చెప్పుకొచ్చాడు.
ఒక రోజు నేను ఊరు వెళ్లి వచ్చేప్పటికి ఇంట్లో ఉన్న వారు అంతా మారిపోయారు. పని వారిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఆమె ఎలాంటి దేవుడు ఫొటోలు లేకుండా పూజాలు చేయడం నేను చూశాను. ఆ పూజ ఎందుకు అనేది నాకు తెలియదు. ఇక సుశాంత్ గత ఏడాది కాలంగా చాలా దీన అవస్థలో ఉన్న వ్యక్తి మాదిరిగా అయిపోయాడు. చివరగా 2019 సెప్టెంబర్‌లో నేను ఆయన్ను కలిశాను. ఆ సమయంలో చాలా బాధల్లో ఉన్నట్లుగా కనిపించాడు. రియా నుండి కాల్ వస్తుంది అంటే సుశాంత్ ఆందోళన పడేవాడు అంటూ అంకిత్ పేర్కొన్నాడు. మొత్తానికి రియా కారణంగా మానసిక ఒత్తిడిని ఆయన బాగా అనుభవించాడంటూ అంకిత్ చెప్పుకొచ్చాడు.