హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా పాతిక సంవత్సరాలుగా తాను రేప్ కు గురయ్యాను అంటూ కోర్టులో పోరాడుతుంది. దర్శకుడు హార్వే వెయిన్ స్టీన్ 1994లో ఈమెను రేప్ చేశాడట. కోర్టులో అప్పటి నుండి ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టి వేయడం లేదు.. అలా అని తుది తీర్పు ఇవ్వడం లేదు. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. న్యాయమూర్తి ముందు అన్నాబెల్లా మరోసారి తన వాదనను వినిపించింది.
అన్నాబెల్లా కోర్టులో న్యాయమూర్తి ముందు అప్పుడు జరిగిన సంఘటనను వివరిస్తూ... 1994లో హార్వే దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ రాత్రి ఆలస్యం అయ్యింది. దాంతో తాను ఇంటి వద్ద దింపుతానంటూ హార్వే నన్ను కారు ఎక్కించుకున్నాడు. కారులో నన్ను ఇంటివద్ద దించి వెళ్లి పోయాడు. నేను ఇంట్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే హార్వే వచ్చి డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. నేను డోర్ ఓపెన్ చేసి ఏమైంది మళ్లీ ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూనే ఉన్నా నన్ను బలవంతంగా ఈడ్చుకుంటూ బెడ్ రూంకు తీసుకు వెళ్లాడు. నా చేతులు బెడ్ కు కట్టేసి నాపై అత్యంత పాశవికంగా అఘాయిత్యంకు పాల్పడ్డాడు.
ఆ రాత్రి నేను పడ్డ వేదన కారణంగా పాతిక సంవత్సరాలు అయినా కూడా ఆ సంఘటనను నేను మర్చి పోలేక పోతున్నాను.. ఆ రాత్రిని తల్చుకుంటేనే నాకు వెన్నులో ఒణుకు పడుతుంది అంటూ అన్నాబెల్లా కన్నీరు పెట్టుకుంది. ఆమె చెప్పే విషయమై నిజమేనా కాదా అని నిర్థారించేందుకు సైకియాట్రిస్ట్ సమక్షంలో ఆమెను విచారించాలని జడ్జీ నిర్ణయించారు. హార్వే పై కేవలం అన్నాబెల్లా మాత్రమే కాకుండా 80 మంది కూడా లైంగిక వేదింపుల కేసులు పెట్టారు. ఇంకా చాలా మంది ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇండియాలోనే అనుకుంటే అమెరికాలో కూడా ఒక కేసును ఇన్ని సంవత్సరాలు నాన్చుతారా అంటూ నెటిజన్స్ నోరు వెళ్లబెడుతున్నారు.