తేజ సజ్జా మిరాయ్.. ఆడియో హక్కులపై భారీ డీల్

ఈ భారీ డీల్ 2.75 కోట్ల రూపాయలకు కుదిరినట్టు సమాచారం. సినిమా నిర్మాణ విలువలు, దాని పాన్ ఇండియా పరిధి, సంగీత దర్శకుడు హరి గౌర ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఈ డీల్ కుదిరినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Update: 2024-11-27 12:47 GMT

యువ కథానాయకుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్ ఫేజ్‌లో ఊపందుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను ఏర్పరుచుకుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్‌డేట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టిప్స్ అన్ని భారతీయ భాషల ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.

ఈ భారీ డీల్ 2.75 కోట్ల రూపాయలకు కుదిరినట్టు సమాచారం. సినిమా నిర్మాణ విలువలు, దాని పాన్ ఇండియా పరిధి, సంగీత దర్శకుడు హరి గౌర ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఈ డీల్ కుదిరినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హనుమాన్ సినిమాకు హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక 'మిరాయ్' వంటి భారీ విజన్ ఉన్న చిత్రానికి అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్స్, ఆడియో ప్లాట్‌ఫామ్ అందించడానికి టిప్స్ సమర్థంగా పనిచేయగలదని చిత్ర బృందం నమ్మకంగా ఉందట.

మిరాయ్ కథ, కథనంలోనే కాకుండా సంగీతంలో కూడా డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని పాటలు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యేలా, ట్రెండింగ్‌కి తగ్గట్లుగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి పాటల మీద ఉన్న ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా, ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటల కాంబినేషన్ సినిమాకు మరింత హైప్‌ను తీసుకురావడం ఖాయం.

తేజ సజ్జా ఈ చిత్రంలో పవర్ఫుల్ యోధుడిగా కనిపించబోతున్నారు. ఇదివరకే విడుదలైన పోస్టర్‌తో ఆయన లుక్, సినిమాపై ప్రేక్షకులలో కుతూహలం పెరిగింది. మిరాయ్ సినిమా తేజ సజ్జా కెరీర్‌లో ట్రెండ్ సెట్టర్ గా నిలవడం ఖాయమని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాయి.

టిప్స్ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకోవడంతో మంచి బజ్ ఏర్పడింది. పాటల ప్రమోషన్, మార్కెటింగ్ వ్యూహాలు టిప్స్ తీసుకోవడం సినిమాకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. అంతేకాక, ఈ డీల్‌తో పాటు సినిమా బిజినెస్ విషయంలో మంచి ఆదాయాన్ని నమోదు చేస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. 2025 ఏప్రిల్ 18న మిరాయ్ 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ మరింత చర్చనీయాంశంగా మారుతోంది.

Tags:    

Similar News