ఆసక్తికరంగా అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్​..

Update: 2023-07-02 12:16 GMT
ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్​ను పలకరించేందుకు సిద్ధమవుతూనే ఉన్నాయి. వీటిలో భారీ సినిమాలను పక్కనపెడితే.. కంటెంట్​ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడలాంటి  మరో సినిమానే  ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఆ సినిమా పేరే అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఇప్పటికే రిలీజైన పోస్టర్​, ప్రోమోలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే పాటలు కూడా శ్రోతల మనసును ఉర్రూతలూగించాయి. తాజాగా ట్రైలర్ కూడా అన్ని రకాల ఎమోషన్స్​తో విడుదలై ఆకట్టుకుంటోంది.  

"నేడే చూడండి మీ అభిమాన అన్నపూర్ణ ఫొటో స్టూడియో. మనస్సుకు హత్తుకునే ప్రేమ కథ, గిలిగింతలు పెట్టే హాస్యం,   ఉర్రూతలెక్కించే అందమైన పాటలు, ఉత్కంఠ భరితంగా సాగే కథనం, ఫైటింగ్ ఛేజింగ్స్​తో ఉహకందని మలుపులు ఉన్నాయని, అంతే కాకుండా వీటితో పాటు మరిన్ని ఉన్నాయంటూ" ప్రచార చిత్రంలో సన్నివేశాలను చూపించారు. ఇందులో నటీనటులు యాక్టింగ్, వారి హావాభావాలు బాగున్నాయి. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా ఆకట్టుకునేలానే ఉంది.

ఈ సినిమా విషయానికొస్తే..  పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ దీన్ని నిర్మించింది. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, లావణ్య ప్రధాన పాత్రలు పోషించారు.

ఇకపోతే ఈ చిత్రంలో వైవా రాఘవ, ఉత్తర, మిహిర,  లలిత్ ఆదిత్య ఇత కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ అందించారు. గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న, ఫన్నీ లవ్ స్టోరీని..  ప్రధాన కథాంశంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించారు.  జులై 21న ఈ సినిమా విడుదల కానుంది’.

ఇక ఇటీవలే టీజర్ రిలీజ్​ అయ్యే సమయంలో దర్శకుడు చందు ముద్దు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. "‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో, అందమైన లొకేషన్స్‌తో, ఆకట్టుకునే మ్యూజిక్‌తో రూపొందించాను. ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే కచ్చితంగా ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను" అని అన్నారు.



Full View

Similar News