పెద్దన్న ను పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారట

Update: 2021-10-21 10:58 GMT
సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ తాజా చిత్రం అన్నాత్తే విడుదలకు సిద్దం అయ్యింది. దీపావళి సందర్బంగా నవంబర్‌ 4న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు లో పెద్దన్న టైటిల్ తో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత సౌత్ లో విడుదల కాబోతున్న మొదటి సూపర్ స్టార్‌ సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అన్నాత్తే సినిమాను అద్బుతంగా దర్శకుడు శివ రూపొందించాడు. గతంలో శివ సినిమాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక అన్నాత్తేను కూడా ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఓవర్సీస్ లో తమిళం మరియు తెలుగు భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేవు రాలేదు కనుక ఖచ్చితంగా ఓవర్సీస్ అభిమానులు సినిమాల కోసం మొహం వాచి ఉన్నారు. అందుకే ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా అక్కడ నిలవడం ఖాయం అన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఈ సినిమా మినిమంగా సక్సెస్ టాక్ దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం. సౌత్ లో సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదటి వంద కోట్ల షేర్‌ సినిమా గా అన్నాత్తే నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దన్నగా విడుదల కాబోతున్న అన్నాత్తే సినిమా లో నయనతార.. కీర్తి సురేష్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సీనియర్ హీరోయిన్స్‌ ఖుష్బు మరియు మీనాలు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. రజినీకాంత్‌ మరియు శివల కాంబో కోసం తమిళ సినీ అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కాంబోలో మూవీ రాబోతున్న నేపథ్యంలో రికార్డుల వర్షం ఖాయం అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్దన్న సినిమా తెలుగు లో భారీగా విడుదల చేయడం కోసం ప్రముఖ నిర్మాత ముందుకు వచ్చాడని తెలుస్తోంది.
Tags:    

Similar News