సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాథే చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉండగా.. కొంత కాలంగా షూటింగ్ పెండింగులో పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ప్రక్రియకు సడలింపునిచ్చాక 2020 డిసెంబర్ లో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ ప్రారంభించిన కొద్దిరోజులకే చిత్రబృందం కోవిడ్ భారిన పడడం.. రజనీ స్వల్ప అస్వస్థతకు గురవ్వడం వగైరా కారణాలతో వాయిదా పడింది.
ఆ తర్వాత ఈ సినిమా షూట్ కి సంబంధించిన సరైన అప్ డేట్ లేదు. అన్నాథే షూటింగ్ మార్చి మూడవ వారం నుండి తిరిగి ప్రారంభమవుతుందని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఒక విలేజ్ సెట్ ని రెడీ చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగానే.. కోలీవుడ్ వర్గాల నుండి వస్తున్న తాజా కథనాల ప్రకారం..దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని మాటా మంతీ సాగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో రజనీ సరసన నయతార- కీర్తి సురేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.