కార్తీ అకౌంట్ లో మరో 100 కోట్లు!

Update: 2022-11-02 14:30 GMT
తమిళ చిత్ర పరిశ్రమంలో ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు సక్సెస్ అందుకుంటున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న వారు కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఇటీవల ఊహించని స్థాయిలో విక్రమ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఇటీవల కార్తీ కూడా వరుసగా మరో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో చేసిన బిగ్ బడ్జెట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దాదాపు 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

ఆ సినిమాలో కార్తీ తో పాటు విక్రమ్ జయం రవి కూడా ఉన్నారు. కాబట్టి అది సోలో సక్సెస్ కాకపోయినప్పటికీ కార్తీ కెరీర్ లో ఒక మంచి మైలురాయి అని చెప్పవచ్చు.

ఇక ఇప్పుడు కార్తీ నటించిన మరో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్నట్లు అర్థమవుతుంది. సూర్య తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికి సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ అయితే ఉంది. ముఖ్యంగా అతని మొదటి రెండు మూడు సినిమాలు కూడా తెలుగులోనే మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత తెలుగు తమిళంలో అతను తన బాక్సాఫీస్ నెంబర్స్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.
 
ముఖ్యంగా తెలుగులో అయితే అతని సినిమాలకు ఆ మధ్యలో నుంచి లాభాలు వచ్చాయి. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 13 కోట్లను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సర్దార్ సినిమా అంతకుమించి అనేలా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోబోతున్నట్లు అర్థం అవుతుంది.

ఇప్పటికే ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో 100 కోట్లను దాటేసి 110 కోట్లను కలెక్ట్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్దార్ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News