'మహర్షి'కి దక్కిన మరో అవార్డు!

Update: 2021-09-18 04:15 GMT
సాక్షి 6th ఎడిషన్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. చాలా గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో, తారలంతా తళుక్కున మెరిశారు. 'మహర్షి' సినిమాకి గాను వివిధ కేటగిరీలలో మూడు అవార్డులు లభించడం విశేషం. మహేశ్ బాబుకి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును వంశీ పైడిపల్లి సొంతం చేసుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ అవార్డును 'దిల్' రాజు అందుకున్నారు. ఈ వేదికపై మహేశ్ బాబు బ్లూ కలర్ షర్ట్ .. గ్రే కలర్ ప్యాంటు ధరించి, మరింత హ్యాండ్సమ్ గా కనిపించారు.

'మహర్షి' సినిమా 2019 మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మహేశ్ బాబు కొత్త లుక్ తో కనిపించాడు. కథాపరంగా ఈ సినిమా గ్రామీణ వ్యవస్థ .. వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ వ్యవస్థ గ్రామాలను మింగేయకుండా కాపాడే బాధ్యత గల పౌరుడుగా ఈ సినిమాలో మహేశ్ బాబు కనిపిస్తాడు. వీలైనంత వినోదంతో పాటు బలమైన సందేశాన్ని ఇవ్వడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడు. అందువల్లనే ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకోగలిగింది.

స్నేహితుడిని ప్రేమించడం .. స్నేహితుడి ఆశయాన్ని గౌరవించడం .. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి కథానాయకుడు తన సుఖాలను పక్కన పెట్టి పోరాడటం ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. యాక్షన్ ను .. ఎమోషన్ సమపాళ్లలో రంగరించి వంశీ పైడిపల్లి అందించిన తీరు ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. మహేశ్ బాబు నటన .. పూజ హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ప్రతి బాణీ ఈ కథకు మరింత ఊతాన్ని ఇచ్చింది. ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఇన్ని ప్రత్యేకతలు .. విశేషాలు కలిగిన కారణంగానే 'మహర్షి' మనసు మనసును ఇప్పటికీ పలకరిస్తూనే ఉన్నాడు. ఇలా అవార్డుల వేదికలపై ఇంకా సందడి చేస్తూనే ఉన్నాడు.
Tags:    

Similar News