సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించి, రచయితగానూ వర్క్ చేసిన 'డీజే టిల్లు'ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సినిమా సినిమాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విమల్ కృష్ణ డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి చిన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 50 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.
'డీజే టిల్లు'కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ లోనే ఎండింగ్ లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చేసిన చిత్ర బృందం అన్నట్టుగానే 'టిల్లు స్వ్కేర్' అంటూ సీక్వెల్ కు శ్రీకారం చుట్టింది.
సినిమా పట్టాలెక్కకుండానే సీక్వెల్ చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. దర్శకుడు మారాడు. అతని స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు. తనతో పాటు హీరోయిన్ నేహా శెట్టి కూడా మారిపోయింది. తన స్థానంలో అనుపమా పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. షూట్ మొదలవ్వగానే తను ఈ మూవీ నుంచి తప్పుకుంది.
తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని నేరుగా చెప్పకుండా అనుపమ 'ప్రతీ ఎగ్జిట్ మరో ఎంట్రీకే' అని తెలివిగా పోస్ట్ పెట్టి తాను 'టిల్లు 2 నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో తన స్థానంలో 'ప్రేమమ్' మడోన్నా సెబాస్టియన్ ని ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. చాలా కాలంగా తెలుగులో హీరోయిన్ గా నిలబడాలని ప్రయత్నిస్తున్న మడోన్నాకిది మంచి అవకాశమని అంతా భావించారు. కానీ తాజాగా ఈ మూవీ నుంచి తను కూడా బయటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
తన స్థానంలో మేకర్స్ 'హిట్ 2' ఫేమ్ మీనాక్షీ చౌదరిని హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తు్నారని, ఇందు కోసం తనతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టిల్లు దెబ్బకు ఒక్కో హీరోయిన్ జంపై పోవడానికి బలమైన కారణం వుందని ఇన్ సైడ్ టాక్.
టిల్లు 2 లో హీరో సిద్దూ జొన్నలగడ్డకు తప్ప హీరోయిన్ క్యారెక్టర్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ లు వాకౌట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.