భారీ అంచనాల మధ్య డీజే (దువ్వాడ జగన్నాథం) విడుదలైన సంగతి తెలిసిందే. డీజే పాటల్లో దొర్లిన పదాల మీద ఇప్పటికే నానా రచ్చ జరగటం తెలిసిందే. శివుడికి ఇష్టమైన నమకం.. చమకం.. పదాలను శృంగారంలో వాడటం ఏమిటన్న ఆగ్రహంతో పాటు.. ఆగ్రహం పేరుతో ఒక వర్గాన్ని అవమానించారన్న విమర్శలు పెద్ద ఎత్తున ముసురుకున్నాయి. దీనిపై దర్శకుడు సర్ది చెప్పి.. తాను సైతం బ్రాహ్మణుడినేనంటూ చెప్పుకున్నారు.
చివరకు అభ్యంతరకంగా ఉన్న పదాల్ని తొలగించటంతో ఒక వివాదం ముగిసినట్లైంది. తాజాగా విడుదలైన ఈ సినిమాలో పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని హీరో చెప్పులు వేసుకొని పఠించటంపై పలువురు మండిపడుతున్నారు. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం విశిష్ఠత తెలిసి ఇలాంటి తప్పులు చేస్తారా? అని మండిపడుతున్నారు.
పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకొని పఠించటం పలువురి మనోభావాల్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. యజ్ఞోపవీతం వేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠిస్తారని.. ఆ మంత్రం అత్యంత పవిత్రమైనదని.. అలాంటి మంత్రాన్ని చెప్పులు వేసుకొని పఠించటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణులుగా పుట్టిన వారు మాత్రమే కాదు.. వైశ్యులు.. క్షత్రియులు యజ్ఞోపవీతానికి చాలా పవిత్రంగా చూసుకుంటారని.. అలాంటిది.. ఆ సీన్ అలా తీయటం ఏమిటంటూ ఫైర్ అవుతున్నారు.
బ్రాహ్మణులు ఎలా ఉంటారన్న విషయంపై తాను పండితుల దగ్గర శిక్షణ పొందినట్లుగా హీరో చెప్పారని.. మరి.. పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకొని చదవకూడదని చెప్పలేదా? అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. చిత్ర బృందం తప్పు చేస్తే.. దాన్ని సరిదిద్దాల్సిన సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని కొందరు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామంటూ పలువురు చెబుతున్నారు. మరీ.. వివాదంపై చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/