సినిమా ఇండస్ట్రీ లో నమ్మకాలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అల వైకుంఠపురములో టీం కూడా అలాంటి సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లు గా కనిపిస్తోంది. ఈ సంక్రాంతి సీజన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
ఎక్కడకు వెళ్లినా.. అల వైకుంఠపురము లో పాటలే వినిపిస్తున్న వేళ.. ఈ చిత్రం వసూళ్ల దుమ్ము రేపటం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో టీం ఉంది. రేపటి (గురువారం) నుంచి వరుస పెట్టి సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 9న దర్బార్.. 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో.. 15న కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందన్నది ఇప్పుడు అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
అన్ని సినిమాలు హిట్ కావాలి.. మా సినిమా కూడా విజయవంతం కావాలంటూ తన కోరికను తాజాగా వెల్లడించారు అల వైకుంఠపురము చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్. మాట అనుకోగానే సరి పోదు కదా? అందుకు తగ్గట్లు కసరత్తు జరగాలి కదా? దీనికి తగ్గట్లే.. తాజాగా కొన్ని సెంటిమెంట్లను ఈ చిత్ర యూనిట్ ఫాలో అవుతుందని చెబుతున్నారు.
అల వైకుంఠపురములో సినిమా టైటిల్ ను ఇంగ్లిషు లో రాయాలంటే ‘Ala Vaikunthapurramuloo’ సరి పోతుంది. కానీ.. గూగుల్ లో మాత్రం Ala Vaikuntapuramlo, Ala Vaikuntapuramulo, Ala Vaikuntapuramuloo ఇలా చాలా స్పెల్లింగుల్లో దర్శనమిస్తోంది. అయితే.. వీటికి భిన్నంగా చిత్ర యూనిట్ మాత్రం మాత్రం ‘Ala VaikunthapuRRamuloo’ అనే స్పెల్లింగ్ కు ఫిక్స్ అయ్యింది.మిగిలిన వాటికి దీనికి తేడా ఏమిటంటే.. మధ్యలో వచ్చే ‘ఆర్’ లు రెండు ఉండటం. అవసరానికి మించిన ఒక ఆర్ ను అదనంగా చేర్చటం గమనార్హం. ఎందుకిలా అంటే.. బన్నీ చిత్రాలకు ఒక సెంటిమెంట్ ఉందని.. దాన్ని ఫాలో కావటం వల్లే ఇలా.. అంటూ అసలు విషయాన్ని చెబుతున్నారు.
గతంలో అల్లుఅర్జున్ నటించిన సరైనోడు ‘‘SaRRainodu’’.. రేసుగుర్రం ), ‘‘Race GuRRam’’ రెండు చిత్రాలకు అవసరానికి మించిన ఒక ఆర్ ను అదనంగా చేర్చటం.. ఆ రెండు సినిమాలు సక్సెస్ కావటం చూస్తే.. తాజా అల వైకుంఠపురము చిత్రంలోనూ రెండు ఆర్ లను చేర్చటం ద్వారా.. సక్సెస్ మీద కర్చీఫ్ వేసినట్లుగా చెబుతున్నారు. విజయానికి అవసరమైన ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా అన్నింటిని ఫాలో అవుతున్న వేళ.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.