రాజ్ కుంద్రాకు మరో భారీ షాక్

Update: 2021-07-29 08:34 GMT
అందాల ముద్దు గుమ్మ శిల్పా శెట్టి గురించి తెలియని వారుండరు. అంతలా తన అందంతో ఈ అమ్మడు కుర్రకారుతో పాటు అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ అమ్ముడ అందాల ఆరబోతకు, ఈ అమ్మడు ఎక్స్పోజింగ్ కు చాలా మంది కుర్రాళ్ల మతులు చెడిపోయాయి. తల్లయినా కానీ ఈ అమ్మడులో అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ రోజురోజుకూ తన అందాన్ని పెంచుకుంటూ పోతుంది. అంతలా అందంగా ఉన్న శిల్పాశెట్టికి ఈ మధ్యే ఓ షాక్ తగిలింది. ఈ ముద్దు గుమ్మ భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ బ్యూటీని కూడా పోలీసులు విచారించారు. కానీ తనకు ఈ పోర్నోగ్రఫీ రాకెట్ తో ఎటువంటి సంబంధం లేదని ఈ అమ్మడు వివరించింది. తాను అందానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది.

ఈ బ్యూటీ అందం కోసం జిమ్ లో చేసే వర్కవుట్లు యోగా సాధనాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అభిమానుల మతులు పోయే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మమ్మీగా మారిన తర్వాత ఎంత గొప్ప అందగత్తె అయినా సరే ప్రాభవం కోల్పోతుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం తల్లయిన తర్వాత ఇంకా అందంగా తయారవుతోంది. ఇలా ఈ అమ్మడు అందం వెనుక సీక్రెట్ తాను చేసే జిమ్ వర్కౌట్లు యోగా నే అని చాలా మంది చెబుతారు.కానీ ఈ అమ్మడు దాంపత్య జీవితం మాత్రం అంత సాఫీగా సాగట్లేదు.

వ్యాపారవేత్త అని రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకున్న బ్యూటీకి అతని వ్యవహార శైలి చిక్కులు తెచ్చి పెడుతోంది. అప్పట్లో రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ జట్టు స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయి ట్రోఫీ నుంచే రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొంది. అయినా రాజ్ కుంద్రా వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. హాట్ షార్స్ట్ ఓటీటీలో పోర్న్ కంటెంట్ ను షూట్ చేసి అప్ లోడ్ చేస్తున్నాడంటూ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాని అరెస్టు చేశారు. తర్వాత న్యాయస్థానం అతడికి బెయిల్ కూడా నిరాకరించింది. దీంతో రాజ్ కుంద్రా పోలీసుల అదుపులోనే మగ్గుతున్నాడు.అయితే తాజాగా రాజ్ కుంద్రాకు మరో బిగ్ షాక్ తగిలింది.

అతడిపై ని ఈ మారు సెబీ కన్నెర్ర జేసింది. తాజాగా ఆయన కంపెనీ వయాన్ ఇండస్ర్టీస్ పై సెబీ మూడు లక్షల రూపాయల భారీ జరిమానాను విధించింది. 45 రోజులల్లోపు జరిమానాగా విధించిన మూడు లక్షల రూపాయలను చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంస్థలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించింది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇంతటి భారీ జరిమానాను విధించింది. ఇదిలా ఉండగా.. వయాన్‌ సంస్థ ఉద్యోగులు కూడా రాజ్ కుంద్రాకు వ్యతిరేఖంగా సాక్ష్యం చెప్పారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారు పోలీసులకు అందజేసినట్లు సమాచారం.



Tags:    

Similar News