ప్రభాస్ దీపిక పదుకునే జంటగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం గురించి రోజుకో వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రతి రోజు కొత్త కొత్త పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా సినిమాకు సంబంధించిన సంగీత దర్శకుడి గురించిన చర్చ జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రంలోని మరో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో కథానుసారం ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా దీపిక పదుకునే ఎంపిక అవ్వగా మరో హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీపిక పాత్ర స్థాయిలో కాకున్నా సెకండ్ హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మహానటి చిత్రంలో సమంత పాత్ర ఎలా ఉంటుందో కాస్త అటు ఇటుగా తక్కువ కనిపించినా ప్రాముఖ్యత కలిగిన పాత్రను సెకండ్ హీరోయిన్ చేయబోతుందట. అయితే ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది.
దీపిక పదుకునే మరియు సెకండ్ హీరోయిన్ కు కాంబో సీన్స్ ఉండే అవకాశం కూడా లేదని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఉంటే ఖచ్చితంగా మరింత గ్లామర్ సినిమాకు జత అయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లాన్ గా తెలుస్తోంది. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.