వెటరన్ నటి టబు 50 ఏళ్ల వయసులోనూ అదే ఛరిష్మాతో నటరంగంలో దూసుకుపోతున్నారు. 30 ఏజ్ లో ఎంత చురుగ్గా తెరపై అలరించారో ఇప్పుడు కూడా మరోసారి అంత బిజీ నటిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. బోల్డ్ కంటెంట్ తొలి నుంచి ఈ జాతీయ ఉత్తమ నటికి కొత్తేమీ కాదు. విభిన్న పాత్రలతో 50 ప్లస్ లోనూ టబు మెరుపులు మెరిపిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తున్నారు. తాజాగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `వైట్` అనే టైటిల్ తో టబు ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో టబు.. వితంతువు పాత్రలో కనిపించనున్నారు. వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం ఎలా సాగింది? అనే పాయింట్ ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు.
టబు కెరీర్ లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ గా ఉండబోతుందని సమాచారం. కథ ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకూ టబు పాత్ర ఎంతో ఆసక్తికరంగా సాగుతుందుట. భర్త చనిపోయిన మహిళని హిందూ సమాజం ఎలా చూస్తుంది? యువత నుంచి అమె ఎదుర్కొనే ఇబ్బందులు? వంటి ఎన్నో అంశాలు ఇందులో చూపిస్తారని సమాచారం. టబు పాత్ర లో బోల్డ్ నెస్ కు ఆస్కారం ఉందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. గతంలో సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో `అస్తిత్వం` అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. మళ్లీ ఇంత కాలానాకి ఆ జోడీ `వైట్` మూవీ కోసం కలిసి పనిచేస్తోంది.
దీంతో సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అవుతోంది. మహేష్ భట్ మేకింగ్.. టబు పెర్పార్మెన్స్ కి మరోసారి జాతీయ అవార్డు ఖాయమనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో `యాంటిమ్ `తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్-ఆయుష్ శర్మ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వైట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఎవరు? ఇంకా ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.