వరుస వివాదాలతో టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు చిక్కుల్లో పడుతున్నాడు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ ‘పెద్ద’ విషయంలో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్నట్టుగా కోల్డ్ వార్ సాగుతోంది. ఇటీవల మోహన్ బాబు లేఖలు కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న మోహన్ బాబు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరగడం.. హెయిర్ డ్రెస్సింగ్ కు సంబంధించిన విలువైన వస్తువులు ఎత్తుకుపోయారని మంచు విష్ణు మేనేజర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు.
ఈ క్రమంలోనే నాయీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిన సినీ హీరో మోహన్ బాబు భేషరతుగా ఆ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుంచి మేకప్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను .. నాయీ బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ బూతులు తిట్టడంతో ఉద్యోగం మానేశాడన్నారు. దాంతో కక్షగట్టి ఎలాంటి నేర నిరూపణ చేయకుండా శ్రీనివాస్ మీద పోలీస్ స్టేషన్ లో రూ.5 లక్షల సామగ్రి దొంగిలించాడని కేసు పెట్టడం అన్యాయమన్నారు.
ఇది నాయీ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నదని.. వెంటనే మోహన్ బాబు మంగలి సమాజానికి క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలచందర్, రాష్ట్ర క్షౌరవృత్తిదారుల సంఘం నేతలు , జిల్లాల అధ్యక్షులు పాల్గొని మోహన్ బాబు వ్యాఖ్యలను ఖండించారు.