హీరోగా కథల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున, నిర్మాతగా ఎంతో మంది కొత్త దర్శకులకు .. కొత్త హీరోలకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన కారణంగా తెలుగు తెరకి పరిచయమైన కథానాయకులలో వెంకట్ ఒకరు. ఆయన పేరు చెప్పగానే 'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా ద్వారానే ఆయన టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా ఆయన కెరియర్ కి హెల్ప్ కాలేదు.
తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. " సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేసేవాడిని. నా ఫొటో చూసి నాకు అన్నపూర్ణ స్టూడియోస్ వారు 'శ్రీ సీతారాముల కల్యాణము చూతాము రారండి' సినిమా కోసం పిలిపించారు.
అంతము ముందే 'నిన్నే పెళ్లాడుతా' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సంబంధించిన సెట్లోనే నాపై ఆడిషన్ జరగడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను సెలెక్ట్ కానని అనుకున్నాను. కానీ నాగ్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం నా అదృష్టం.
ఈ సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఎంతమాత్రం యాక్టింగ్ రాదు. దాంతో టేకుల మీద టేకులు తీసుకుంటూ ఉండేవాడిని. ఇక ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారు కూడా ఉన్నారు.
ఆయన కాంబినేషన్లో నేను ఒక సీన్ చేయవలసి వచ్చింది. ఆయన నా చెంపపై కొట్టినట్టుగా నటించాలి. ఆయన అలా చేస్తుంటే నా వైపు నుంచి సరైన రియాక్షన్ రావడం లేదు. దాంతో ఆయన నిజంగానే నా చెంప పగులగొట్టారు. ఆ తరువాత చూసుకుంటే చెంప ఎర్రగా కందిపోయింది.
ఏఎన్నార్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కెమెరా సెన్స్ .. టైమింగ్ చూసి నేను షాక్ అయ్యాను. సెట్ కి వచ్చిన దగ్గర నుంచి ఆయన తన పాత్రకి సంబంధించిన ధ్యాసలోనే ఉండేవారు. ఆయనతో కలిసి మొదటి సినిమాలోనే చేసే ఛాన్స్ రావడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక జ్ఞాపకం. ఆ తరువాత 2014కి ఒక సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం కారణంగా నేను 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో చాలా సినిమాలు చేజారిపోయాయి" అని చెప్పుకొచ్చాడు.