వీడియో: సుందర్ ప్రపంచంలో చక్కిలిగింతలు..!

Update: 2022-05-26 11:46 GMT
సుందరం ప్రపంచంలోకి స్వాగతం పలికారు నేచురల్ స్టార్ నాని. జూన్ 10వ తేదీ నుంచి థియేటర్లలో అందరికీ చక్కిలిగింతలు పెట్టబోతున్నట్లు చెబుతున్నాడు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''అంటే.. సుందరానికీ!". ఇందులో మలయాళ భామ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా నటించింది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే 'అంటే సుందరానికీ!' సినిమా నుంచి వచ్చిన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'సుందర్ చక్కిలిగింతలు' పేరుతో ఓ వీడియోని వదిలారు.

'అంటే సుందరానికీ' షూటింగ్ లో బ్లూపర్స్ ని ఈ వీడియోలో చూపించారు. చిత్రీకరణ అంతా ఆహ్లాదకరంగా ఎంతో సరదాగా సాగినట్లు ఈ వీడియోని బట్టి అర్థం అవుతోంది. షూటింగ్ సమయంలోనే టీమ్ అంతా పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది. మరి ఈ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులు ఏ విధంగా నవ్విస్తాయో చూడాలి.

కాగా, సుందర్ ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడికి లీలా థామస్ అనే క్రిస్టియన్ అమ్మాయికి మధ్య ఆహ్లాదకరమైన ప్రేమ కథని 'అంటే.. సుందరానికీ!' చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో సీనియర్ నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించారు. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేయగా.. లతా నాయుడు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'అంటే సుందరానికీ' సినిమా మూడు దక్షిణాది భాషల్లో 2022 జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లోకి రాబోతోంది. తమిళ్‪ లో 'అడాడే.. సుందరా'.. మలయాళంలో 'ఆహా.. సుందరా' టైటిల్స్‪ తో ఈ సినిమా విడుదల కానుంది.


Full View
Tags:    

Similar News